ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ బాడీ క్రీమ్స్ లేదా లోషన్లను యూజ్ చేస్తున్నారు.ఇటు వంటివి వాడటం వల్ల పొడి బారి నిర్జీవంగా మారి పోయిన చర్మం తేమగా, కాంతి వంతంగా మారుతుంది.
ఏవైనా మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్‌ను పొందొచ్చు.
చెమటల వల్ల చర్మం నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.ఇలా చెప్పుకుంటే పోతూ బాడీ క్రీమ్స్ లేదా లోషన్ల తో చాలా ప్రయోజనాలే ఉన్నాయి.
అయితే ఆ ప్రయోజనాలన్నీ పూర్తిగా మనకు దక్కాలంటే వాటిని ప్రతి రోజూ వాడటం ఎంత ముఖ్యమో.ఎలా వాడుతున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.
నిజానికి బాడీ క్రీమ్స్ రాయడానికీ కొన్ని పద్ధతులు ఉన్నాయి.మరి ఆ పద్ధుతులు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
చాలా మంది స్నానం చేసిన వెంటనే కాకుండా.శరీరం మొత్తం తడారి పోయాక క్రీమ్స్ లేదా లోషన్లను అప్లై చేసుకుంటుంటారు.
కానీ, అలా చేయడం చాలా పొరపాటు.నిజానికి చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే వాటిని రాసేసుకోవాలి.
దాంతో ఆ తడి ద్వారా మీరు రాసుకున్న క్రీమ్ చర్మ గ్రంథులకు బాగా అందుతుంది.ఫలితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
అలాగే బాడీ క్రీమ్స్‌ను గట్టిగా రుద్దుతూ ఎలా పడితే అలా రాసుకోకూడదు.ముందుగా క్రీమ్ తీసుకుని స్కిన్‌పై చిన్న చిన్న డాట్స్‌లా పెట్టాలి.అనంతరం సర్క్యులర్ మోషన్‌లో స్మూత్‌గా రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి.
ఇక శరీరం కూల్‌గా ఉన్నప్పుడు బాడీ క్రీమ్స్‌ను రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దక్కవు.బాడీ కాస్త వేడిగా ఉన్నప్పుడే క్రీమ్స్ అప్లై చేసుకోవాలి.లేదా గోరు వెచ్చని నీళ్లలో ముంచిన టవల్‌తో చర్మాన్ని అద్ది.
ఆపై క్రీమ్ లేదా లోషన్‌ను పూసుకోవాలి.అప్పుడు పైన చెప్పుకున్న ప్రయోనాలు పొందుతారు.