విజయ్ శేఖర్ శర్మ.( Vijay Shekhar Sharma ) బడిపంతులు కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి.
అన్ని సమస్యలను అధిగమిస్తూ 2010లో పేటీఎం( Paytm ) అనే ఒక సంస్థను స్థాపించాడు.డిజిటల్ మనీ రూపంలో విజయ్ శేఖర్ శర్మ ఒక విప్లవాన్ని సృష్టించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఇప్పుడు ఆర్థికంగా అనేక నష్టాలను అయితే ఎదుర్కొంటున్నాడు.కానీ యువకుడు అయినటువంటి విజయ్ భారత దేశంలోనే డిజిటల్ వ్యవస్థలో అత్యున్నంత స్థాయికి ఎదిగాడు.
అందుకోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది.అయితే నష్టాల్లో ఉన్న విజయ్ నీ ఆదుకునేందుకు ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఈ సంస్థకు సహాయం చేసి దాన్ని కొనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

గతంలో ఇలా ఒక కంపెనీ దివాలా తీయడం లేదా దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం కోసం దివాలా తీపించేయడం ఒక పద్ధతిగా మొక్కకు అంటు కట్టినట్టుగా చాలా చక్కగా చేస్తూ వస్తున్నారు బడాబడా వ్యాపారవేత్తలు.అందుకోసం రెండు ఉదాహరణలు చెప్తాను.అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన అతి పెద్ద బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా.
( Vijay Mallya ) కింగ్ ఫిషర్ అనే సంస్థను స్థాపించి దేశంలోనే ఎక్కడా లేనంత నాణ్యతగా బీర్ అందించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తూ ఉండేవాడు అతడి దగ్గర దొరికినంత నాణ్యతగా వస్తువు మరి ఎక్కడ దొరకదు అని పేరు కూడా సంపాదించుకున్నాడు.

కానీ బీర్ అమ్మినన్ని రోజులు ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఏయిర్ లైన్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడో అరబ్ కంపెనీ అయినటువంటి ఇతియాడ్( Etihad ) ఏం చేసిందో ఏమో మొత్తానికి విజయ్ మాల్యాను దివాలా తీపించి ఇండియా నుంచి పారిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.మరో ఉదాహరణ చూస్తే ఇండియాలోనే ప్రముఖ రిటైల్ వ్యాపారస్తుడు కిషోర్ బియానీ.( Kishore Biyani ) ఇతడిని అందరూ శ్యామ్ వాల్టన్ ఆఫ్ ఇండియా అని అనేవారు.
అతిపెద్ద రిటైల్ సంస్థగా ఉన్న ఇతడు దాదాపు ప్రపంచంలోనే 20 ఏళ్ల పాటు ధనవంతుడిగా ఉన్నాడు.

అయితే కిషోర్ ఫ్యూచర్ రిటైల్( Future Retail ) అనే ఒక సంస్థను స్థాపించిన సందర్భంలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.ఆ టైంలో ఆయన కంపెనీని అంబానీ టేకోవర్ చేయాలని కూడా ప్రయత్నించాడు.కానీ అమెజాన్ వాడు కిషోర్ సంస్థ పై కేసు వేసి సంస్థని కొనకుండా చేసి పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయేలా చేశాడు.
ఇప్పుడు పేటీఎం సంస్థ వంతు వచ్చింది.మరి మన ఇండియాలో ఎదుగుతున్న ఇలాంటి కంపెనీలు లేదా విజయ్ శేఖర్ శర్మ లాంటి కుర్రాళ్ళు ఎవరి చేతిలో బలైపోతారో పెద్దవారి చేతిలోకి సంస్థలు వెళ్ళిపోయి మరింత పెద్దగా అవుతాయో లేదా కొంతమంది చేతుల్లోకి వెళ్లి దివాలా తీస్తాయో వేచి చూడాలి.