13 నుంచి హాకీ ప్రపంచకప్‌.... ఏ దేశం సత్తా ఎంతంటే?

హాకీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది.2023 జనవరి 13 నుంచి 29 వరకు హాకీ ప్రపంచకప్‌ జరగనుండగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు రూర్కెలా ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.హాకీ ప్రపంచకప్ మొదటిసారిగా 1971లో జరిగింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు 1975లో ఒక్కసారి మాత్రమే భారత్ ఛాంపియన్‌గా అవతరించింది.ఈ టోర్నీలో పాకిస్థాన్ అత్యధికంగా అంటే నాలుగుసార్లు విజేతగా నిలిచింది.

 Hockey World Cup From 13 , Hockey World , Hockey , Hockey India Team , Hockey P-TeluguStop.com

భారతదేశం సత్తా

భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరుగాంచింది.ప్రపంచ కప్‌లో భారత రికార్డు పెద్దగా ఉండకపోవచ్చు.కానీ భారత ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో తమ ప్రతిభ చాటారు.1975లో మలేషియా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్ తొలిసారిగా ఛాంపియన్‌గా అవతరించింది.ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 2-1తో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

రెండు జట్లు రెండోసారి ఫైనల్‌కు చేరాయి.పాకిస్థాన్ రెండో టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది.

భారత జట్టు చరిత్ర సృష్టించింది.భారత్ తరపున సుర్జిత్ సింగ్ రంధవా, అశోక్ కుమార్ ఫైనల్‌లో రెండు గోల్స్ చేశారు.

పాకిస్తాన్ సత్తా

1971లో తొలిసారిగా హాకీ ప్రపంచకప్‌ను నిర్వహించారు.ఫైనల్లో ఆతిథ్య స్పెయిన్‌ను 1-0తో ఓడించి టైటిల్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది.తరువాత పాకిస్తాన్ సెమీ ఫైనల్లో భారత్‌ను ఓడించింది.1978లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో నిర్వహించిన ప్రపంచకప్‌లో కూడా పాకిస్థాన్ మరోమారు విజేతగా నిలిచింది.నెదర్లాండ్స్‌ను 3-2తో ఓడించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.1982లో తొలిసారిగా హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం భారతదేశానికి దక్కింది.అయితే టీమ్‌ ఇండియా సెమీఫైనల్‌కు కూడా చేరలేక చతికిల పడింది.పాకిస్తాన్ వరుసగా రెండవ, మూడవ ఓవరాల్ టైటిల్‌ను గెలుచుకుంది.చివరకు ఫైనల్‌లో పశ్చిమ జర్మనీని ఓడించింది.హాకీ ప్రపంచకప్‌ను 1994లో ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది.ఇలా పాక్ 4వసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించింది.ఆ తర్వాత మ్యాచ్ 1-1తో టై అయ్యింది.పెనాల్టీ స్ట్రోక్స్‌లో పాకిస్తాన్ 4-3తో నెదర్లాండ్స్‌ను అలవోకగా ఓడించింది.

నెదర్లాండ్స్ సత్తా

Telugu Hockey, Hockey India, Hockey Pakistan, Cup-Latest News - Telugu

1973లో రెండవ హాకీ ప్రపంచ కప్ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగింది.ఈసారి ఫైనల్స్‌కు భారత జట్టు చేరింది.నెదర్లాండ్స్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్ 2-2తో టై అయ్యింది.

తర్వాత పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా ఛాంపియన్‌ను ఖరారు చేసుకుంది.అప్పుడు నెదర్లాండ్స్ 4-2తో భారత్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.1990లో ఈ కప్‌కు పాకిస్తాన్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది.ఫైనల్లో నెదర్లాండ్స్ 3-1తో పాకిస్తాన్‌ను ఓడించింది.1998లో నెదర్లాండ్స్ తమ ఆతిథ్యంలో టైటిల్ దక్కించుకుంది.ఫైనల్‌లో స్పెయిన్‌ను 3-2తో ఓడించింది.

మొదటిసారిగా యూరప్‌లోని రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది.ఆటలో నెదర్లాండ్స్ విజయం సాధించింది.

మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube