Ray Ranno : మోసం చేసే భర్తలను కనిపెట్టడమే ఇతడి పని.. అపాయింట్‌మెంట్ కోసం క్యూలో భార్యలు..?

సాధారణంగా కొంతమంది భార్యలకు భర్తల మీద అనుమానం ఉంటుంది.వారిపై నిఘా వేసి తమ అనుమానం నిజమేనా కాదా అనేది తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఉంటుంది.

 His Job Is To Find Cheating Husbands Wives In Queue For Appointment-TeluguStop.com

అయితే ఆ పని చేయడానికి నేనున్నానని ముందుకు వచ్చాడు కనెక్టికట్‌కు చెందిన ఒక ప్రైవేట్ పరిశోధకుడు.అతని పేరు రే రాన్నో.

మోసం చేసే వారిని ఇట్టే పసిగట్టగల నైపుణ్యం ఇతడి సొంతం.అతడు తనకు వచ్చిన కేసుల్లో దాదాపు సగం మంది భాగస్వాములను మోసం చేస్తున్నారని కనుగొన్నాడు.

రే తన అనుభవం ద్వారా, మగవారు ఎవరితోనైనా ఎఫైర్ కలిగి ఉన్నవారిని చెప్పడానికి కొన్ని కామన్ థింగ్స్ చేస్తారని కనుగొన్నాడు.

Telugu Behaviors, Proof, Hidden Camera, Infidelity, Nri, Private, Ray Ranno, Sur

రే( Ray Ranno ) గమనించిన విషయాలలో ఒకటి, వ్యక్తులు తమ రహస్య ప్రేమికులను కలుసుకునే ముందు తరచుగా వారి కార్లను శుభ్రం చేస్తారు.వారు మంచి ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయడానికి ఇలా చేస్తారని అతడు అభిప్రాయపడ్డాడు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, సాధారణంగా పురుషులు కార్ వాష్‌కు వెళతారని రే అభిప్రాయపడ్డారు, ఎందుకంటే మహిళలు వారి సొంత కార్లలో కాకుండా మగవారి కార్లలో వెళతారు.

Telugu Behaviors, Proof, Hidden Camera, Infidelity, Nri, Private, Ray Ranno, Sur

అతని నిఘా పని సమయంలో, రే ప్రధాన లక్ష్యం రుజువును సేకరించడం.దీన్ని చేయడానికి, అతను దూరం నుంచి చిత్రాలు, వీడియోలను తీయడానికి లాంగ్-లెన్స్ కెమెరాతో సహా వివిధ సాధనాలను ఉపయోగిస్తాడు.అతను హిడెన్ కెమెరాతో( Hidden Camera ) ఫేక్ కాఫీ కప్పు వంటి పరికరాలను కూడా ఉపయోగిస్తాడు.తద్వారా ఎవరికీ అనుమానం రాకుండా వీడియోలను రికార్డ్ చేస్తాడు.

ఇది కాఫీ షాపులు లేదా సూపర్ మార్కెట్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.అయితే అనుమానం ఉన్న చాలా మంది భార్యలు ఇతడి అపాయింట్‌మెంట్ కోసం క్యూ కడుతున్నట్లు సమాచారం.

రే తన కెరీర్‌లో చాలా ఆసక్తికరమైన అనుభవాలను చవిచూశాడు.ఉదాహరణకు, అతను ఒకసారి ఒక వ్యక్తి తన భార్యను చంపాలంటూ రే ని రిక్వెస్ట్ చేశాడు.

అదృష్టవశాత్తూ, రే ఈ అభ్యర్థనను అంగీకరించలేదు.ఇంకా ఇలాంటి విచిత్రమైన కేసులను భార్యాభర్తల నుంచి తనకు రావడం జరుగుతుందని అతను చెబుతున్నాడు.

ఏది ఏమైనా భర్తలపై నిఘా పెట్టేందుకు భార్యలకు ఇలాంటి ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లు( Private investigator ) దొరకడం ఆశ్చర్యకరంగా ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube