కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలామంది పని చేయడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వీడియో కాల్స్‌పైనే ఆధారపడ్డారు.వీటి వల్ల చాలా ప్రయోజనాలను పొందారు.
అయితే వీటివల్ల ఎన్ని లాభాలు కలిగాయో అదే స్థాయిలో నష్టాలు కూడా కొంతమందికి జరిగాయి.ముఖ్యంగా ప్రజలు తమ కెమెరాలను ఆఫ్ చేయడం మర్చిపోయి కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలను ఫేస్ చేశారు.
ఇప్పటికీ ఈ వీడియో కాల్స్ ద్వారానే చాలామంది పనులు చేసుకుంటున్నారు.అయితే ఇటీవల ఒక మహిళ వీడియో కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయి అందరూ చూస్తుండగానే కెమెరా ముందే స్నానం చేసింది.
దానివల్ల వారందరి ముందు ఆమె పరువు పోయింది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల యూకేకి చెందిన ఒక మహిళ వ్యాపారవేత అంత్యక్రియలను( Funeral ) వీక్షించడానికి జూమ్ కాల్( Zoom call ) చేసింది.కొద్దిసేపు అంత్యక్రియలను చూసిన తర్వాత ఆమె దానిని ఆఫ్ చేశాను అనుకుంది.అలా అనుకోకుండా కెమెరాను ఆన్ చేసి ఉంచి స్నానం చేయడం మొదలు పెట్టింది.
ఈ ఆన్‌లైన్ సేవకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ తన స్నానం కనిపిస్తుందని ఆమెకు తెలియదు.

ఈ సంఘటన లండన్( London )లోని బార్నెట్‌లోని చర్చి నుంచి ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా జరిగింది.కేన్సర్‌తో మృతి చెందిన వ్యక్తికి నివాళులు అర్పించారు.అంత్యక్రియల రిసెప్షన్‌లో వ్యాపారవేత్త తన తప్పు గురించి తెలుసుకుంది.
ఈవెంట్ వీడియోలు వాట్సాప్‌లో వ్యాప్తి చెందడం ప్రారంభించాయి.దీనివల్ల సదరు మహిళ మానసికంగా చాలా సఫర్ అవుతోంది.
టెక్నాలజీ వాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి పెను ప్రమాదాలే చోటు చేసుకుంటారని మరోసారి నిరూపితమైంది.ఇకపోతే ముఖ్యమైన ఆన్‌లైన్ మీటింగ్‌లో ఎవరైనా బట్టలు లేకుండా కనిపించడం ఇదే కాదు.
ఏప్రిల్ 2021లో, కెనడియన్ మాజీ పార్లమెంటు సభ్యుడు విలియం అమోస్ అతని సహచరులకు నగ్నంగా కనిపించాడు.అతను అప్పుడే జాగింగ్ నుండి తిరిగి వచ్చాడు.
పని దుస్తులను మార్చుకుంటాడు, పొరపాటున అతని కెమెరా ఆన్ అయ్యింది.అతను ఆ తప్పుకు క్షమాపణలు చెప్పాడు, ఇది మళ్లీ జరగదని వాగ్దానం చేశాడు.







