టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ( Gudivada ) నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారింది.టీడీపీ ( TDP ) నిర్వహించే రా కదలి రా సభలో చంద్రబాబు( Chandrababu Naidu ) పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఒకే చోట రెండు పార్టీలకు చెందిన కార్యక్రమాలు జరగనుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అలాగే నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ, వైసీపీకి చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.