కేవలం పది రోజుల కోసం కోట్ల రూపాయిలు వృధా ఖర్చు..సమంత దగ్గర అంత డబ్బు ఉందా!

సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత( Samantha ) పేరు మొదటి స్థానం లో ఉంటుంది.ప్రస్తుతం ఈమెకి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఇండియాలో ఏ హీరోయిన్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.

 Heroine Samantha Spends Crores For Her Treatment In Newyork Details, Heroine Sam-TeluguStop.com

రీసెంట్ గా ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసిన టాప్ 10 ఫేమస్ ఇండియన్ హీరోయిన్స్ లో సమంత మొదటి స్థానం లో నిల్చింది.సోషల్ మీడియా లో ఈమె నిత్యం ట్రెండింగ్ లో ఉండడమే అందుకు కారణం అని చెప్తున్నారు.

నాగ చైతన్య తో( Naga Chaitanya ) విడాకులు, అలాగే మయోసిటిస్ వ్యాధితో ఆమె పడిన బాధలు, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, ఇలా ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ.ఆ రేంజ్ లో చర్చ నడుస్తుంది కాబట్టే సమంత నేడు టాప్ 1 స్థానం లో ఉంది.

Telugu Samantha, Kushi, Naga Chaitanya, Newyork-Movie

ఇక ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ ( Kushi Movie ) సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.లైగర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) ‘శాకుంతలం’ వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత సమంత కలిసి చేస్తున్న చిత్రం ఇది.టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఇలా అన్నీ కూడా అద్భుతంగా ఉండడం తో మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో అనేది తెలియాలంటే సెప్టెంబర్ 1 వ తారీఖు వరకు ఆగాల్సిందే.

ఇది ఇలా ఉండగా సమంత ప్రస్తుతం ‘మయోసిటిస్’ ( Myositis ) వ్యాధి చివరి దశ ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ కి వెళ్ళింది.అక్కడ ఈమె చిల్ అవుతూ, అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఫోటోలు దిగడం , వాటిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యడం వంటివి చేస్తుంది సమంత.

Telugu Samantha, Kushi, Naga Chaitanya, Newyork-Movie

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె గురించి సోషల్ మీడియా లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.అదేమిటంటే ఈమె న్యూయార్క్ లో( Newyork ) ట్రీట్మెంట్ కోసం పది రోజులు ఉండాల్సి ఉంది.ఈ పది రోజులు హోటల్ లో ఉండడం ఇష్టం లేక, ఆమె సొంత ఇల్లు ని 8 కోట్ల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసిందట.ట్రీట్మెంట్ అయ్యేవరకు ఆమె ఇక్కడే ఉంటుందట.

అంతే కాదు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా ఆమె ఇక్కడే స్టే చేస్తాడట ఇక నుండి.అలా కేవలం 10 రోజులు హోటల్ లో ఉండడం ఇష్టం లేక 8 కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొనేసింది అంటే సమంత సంపాదన ఎంత ఉంటుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube