బాలనటిగా కెరియర్ ను ప్రారంభించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రాశి.14 ఏళ్ల వయస్సులోనే సినీ కెరియర్ ను ప్రారంభించి 75 సినిమాల్లో నటించింది.విడుదలైన తన తొలి సినిమా శుభాకాంక్షలు.అంతకంటే ముందు బదిలి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన రాశి.ఆ సినిమాతో తన పేరును మార్చుకుంది.అప్పటి వరుకు విజయలక్ష్మిగా పరిచయం చేసుకున్న రాశి.
బదిలి సినిమాలో విజయలక్ష్మి అనే పేర్లు ఎక్కువగా ఉండడంతో…విజయలక్ష్మి కాస్త రాశిగా మారింది.
అయితే తనకు హీరోయిన్ గా చేయగలిగే టాలెంట్ ఉందని గుర్తించింది తన తండ్రేనని గర్వంగా చెబుతోంది రాశి.
రావుగారి ఇల్లు సినిమాలో తాను చేసిన క్యారక్టర్ ను వేరే అమ్మాయి చేయాల్సి ఉంది.షూటింగ్ సందర్భంగా ఆమె పన్నుఊడిపోవడంతో .ఆమె స్థానంలో తనని తీసుకున్నారని, ఆ సినిమాలో డబ్బింగ్ తో పాటు యాక్టింగ్ బాగా చేయడంతో తన తండ్రి తనని హీరోయిన్ ను చేసినట్లు చెప్పింది.
లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా హిందీ సినిమా గిరఫ్తార్.
గిరప్తార్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీ కాంత్ ముగ్గురు యాక్ట్ చేశారు.ఆ సినిమాలో కమల్ హాసన్ చైల్డ్ హుడ్ క్యారక్టర్ లో రాశి యాక్ట్ చేసింది.
చిన్నతనంలో కమల్ హాసన్ తన తండ్రి మరణిస్తే., తండ్రి మరణాన్ని తట్టుకోలేక తల్లిని పట్టుకొని ఏడ్చే క్యారక్టర్.
తన తల్లి క్యారక్టర్ లో ఉన్న మరో యాక్టర్ తనని ఎత్తుకుంటే ఏడ్చానని, దీంతో చేసేది లేక చిత్ర యూనిట్ తన తల్లికే క్యారక్టర్ ఇప్పించారని గుర్తు చేసుకుంది రాశి.అలా ముగ్గురు హీరోలు, తల్లి తో యాక్ట్ చేయండం ఆనందంగా ఉందని అలనాటి తీపి గుర్తుల్ని అభిమానులతో పంచుకుంది ఈ అందాల రాశి.