తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.అయితే ఈ సినిమా రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా కరోనా కారణంగా వాయిదా పడ్డ మాస్టర్ చిత్రం ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు ఏమీ కనిపించడం లేదు.
దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ తమిళ సినీ వర్గా్లో జోరుగా వినిపిస్తోంది.సంక్రాంతి రిలీజ్ అంటే ఇంకా చాలా సమయం ఉందని, ఈ లోపు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందేమో అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
దీంతో చిత్ర యూనిట్ ఓ మాస్టర్ ప్లా్న్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మాస్టర్ యూనిట్ భావిస్తోంది.
దీంతో దీపావళికి రాబోయే టీజర్‌తో విజయ్ అదిరగొట్టేందుకు రెడీ అవుతున్నాడని ఆయన ప్రేక్షకులు అంటున్నారు.ఇక ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.మరి దీపావళికి రానున్న టీజర్ ఎలా పేలుతుందో తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే అంటున్నారు తమిళ సినీ వర్గాలు.
మరి ఈ సినిమాతో మాస్టర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.