'సారి' చిత్రంలో సూపర్ హీరోగా రాగిణి ద్వివేది నట విశ్వరూపం

పలు భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న రాగిణి ద్వివేది నటిస్తున్న కొత్త చిత్రం “సారి”. దీనికి ‘కర్మ రిటర్న్స్’ ఉప శీర్షిక.

 Heroine Ragini Dwivedi Super Hero Movie Sorry Press Meet Details, Heroine Ragini-TeluguStop.com

తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ బాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మ దరకత్వం వహిస్తున్నారు.కె.వి.ఎం.డి ప్రొడక్షన్స్, కిస్ ఇంటర్నేషనల్స్ పతాకాలపై.నిర్మాత నవీన్ కుమార్ (కెనడా) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ మొదలు కానున్నది.ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో కథానాయిక రాగిణి ద్వివేది, దర్శకుడు బ్రహ్మ, సహ నిర్మాత జై కృపాలిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అఫ్జల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కథానాయిక రాగిణి ద్వివేది మాట్లాడుతూ, సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

ఇంతకుమునుపు ఎన్నడు పోషించని సూపర్ హీరో గా ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నాను.నటించడానికి నాకెంతో స్కోప్ ఉన్న పాత్ర మాత్రమే కాదు నన్ను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం.

సూపర్ హీరో చిత్రమనగానే సహజంగా ఫైట్స్ ఉంటాయి.వాటిని కూడా నేను ఎంతో బాగా చేస్తున్నాను.

సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రానికి పెద్ద పీట వేశాం.తెలుగులో ఇదివరకు నటించినప్పటికీ, ఇతర భాషలలో చేస్తూ ఉండటంవల్ల తెలుగులో అధికంగా చిత్రాలు చేయలేకపోయాను.

ఇకమీదట తెలుగు చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు బ్రహ్మ మాట్లాడుతూ , మూడు భాషలలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ కథ చిత్రమిది.

ఇందులో సూపర్ హీరోగా రాగిణి విశ్వరూపం చూడబోతున్నారు’ అని చెప్పగా, సహ నిర్మాత జై కృపాలిని మాట్లాడుతూ, ఈ చిత్రం మూడవ షెడ్యూల్ ను జూన్ లో హైదరాబాద్ లో చేయబోతున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్ గణేశన్, సంగీతం: రాజు ఎమ్మిగనూరు, రచన: బోయనపల్లి రమణ, ఎడిటింగ్: నందమూరి హరి, కొరియోగ్రఫీ: ఇమ్రాన్ సర్ధారియా, ఫైట్స్ : అల్టిమేట్ శివు, ఫయాజ్ ఖాన్, సహ నిర్మాత జై కృపాలిని, నిర్మాత: నవీన్ కుమార్ (కెనడా), దర్శకత్వం: బ్రహ్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube