సినిమాలు నిల్.. ఓటిటి ఫుల్.. అంజలి నీ బ్రతికిస్తున్న సిరీస్ లు

అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది హీరోయిన్ అంజలి పరిస్తితి.ఈ అమ్మడు ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోలు లో జన్మించింది.

 Heroine Anjali Busy With Ott Details, Heroine Anjali , Anjali Ott Movies, Anjali-TeluguStop.com

కానీ ఈమె పిన్ని చెన్నై లో తన ఇంట ఉంచుకొని హీరోయిన్ గా చేసింది.ఈమె నటించిన మొదటి సినిమా ఫొటో 2006 లో వచ్చింది.

తర్వాత ప్రేమలేఖ రాశా అనే మరో సినిమాలో నటించిన కూడా తెలుగు వారు అంజలిని పెద్దగా పట్టించుకోలేదు.

దాంతో తమిళం లో నటించడం మొదలు పెట్టింది అంజలి.

అక్కడ మంచి బ్రేక్ దక్కించుకొని, అరడజను కు పైగా సినిమాల్లో నటించింది.అంతే కాదు కన్నడ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

దాదాపు ఆరేళ్ల పాటు అర వాళ్ళ సినిమాల్లో నటించిన అంజలి 2012 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.ఈ చిత్రం అంజలికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావడంతో పాటు తెలుగులో మరిన్ని అవకాశాలను సైతం దక్కేలా చేసింది.

Telugu Anjali, Anjali Offers, Anjali Ott, Anjali Web, Ram Charan, Rc, Tollywood-

ఆ తర్వాత బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, సరైనోడు, చిత్రాంగద, నిశబ్దం, వకీల్ సాబ్, మాచర్ల నియోజక వర్గం సినిమాల్లో నటించింది.వచ్చే ఏడాది రామ్ చరణ్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంది.కెరీర్ ప్రారంభం అయ్యి ఇన్నేళ్ళు గడుస్తున్న కూడా ఎందుకో అంజలికి సరైన స్టార్ డం మాత్రం దక్క లేదు.అందుకు ప్రత్యామ్నాయం గా అంజలి ఎక్కువగా ఓటిటి లో కనిపించడం మొదలు పెట్టింది.

Telugu Anjali, Anjali Offers, Anjali Ott, Anjali Web, Ram Charan, Rc, Tollywood-

ప్రస్తుతం అమే ఓటిటి స్టార్ గా మారిపోయింది.హాట్ స్టార్ లో రెండు సిరీస్ లలో కనిపించడం తో మరల ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.దాంతో మరల ఆమె బిజీ గా మారింది.ప్రస్తుతం మలయాళం లో రెండు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం తో పాటు తెలుగు మరియు తమిళ భాషలో బిజీ గా మారింది.

ఇలాగే కొనసాగితే అమే అగ్ర కథానాయిక గా మారడం ఖాయం గా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube