Adah Sharma: నీకు ఎటువంటి అబ్బాయి కావాలంటూ ఆదాశర్మకు ప్రశ్న.. అదిరిపోయే సమాధానమిచ్చిన బ్యూటీ?

టాలీవుడ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదా శర్మ( Adah Sharma ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.హార్ట్ ఎటాక్ సినిమాతో( Heart Attack Movie ) తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

 Heroine Adah Sharma Answers To What Kind Of Boyfriend She Wants Viral-TeluguStop.com

ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తొలిసారిగా 2008లో హారర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటి అవార్డు( Best Actress Award ) కూడా అందుకుంది.

ఆ తర్వాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ బ్యూటీ.

కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో( Bollywood ) అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఇతర భాషలలో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారింది.ఇక ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక బుల్లితెరపై కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది తన డాన్స్ వీడియో లతో బాగా సందడి చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది.నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ ఉంటుంది.

ఇక ఈమె మూగజీవుల పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది.

వాటితో టైం స్పెండ్ చేసిన ఫొటోస్, వీడియోస్ బాగా పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు ఘోస్ట్ సంబంధించిన పిక్చర్స్ కూడా అందరికి దడ పుట్టిస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

చాలా ఆసక్తిగా ప్రశ్నలు వేస్తూ అందరిని తికమక చేస్తూ ఉంటుంది.ఇక రీసెంట్ గా తను నటించిన ది కేరళ స్టోరీ( The Kerala Story ) తనకు మంచి సక్సెస్ అందించింది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అయితే అందులో తను వేసుకున్న షర్ట్, తన వెనుకాల ఉన్న వాల్ రెండు ఒకేలాగా ఉన్నాయి.ఇక వాల్ ఫస్ట్ ఆ తన షర్ట్ ఫస్టా అని అడిగింది.దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానం చెబుతూ కనిపించారు.అయితే ఒక నెటిజన్.మీకు ఎటువంటి అబ్బాయి కావాలి అని ప్రశ్నించడంతో వెంటనే ఆదాశర్మ.

నాలుగు కాళ్లు ఒక తోక ఉంటే బాగుంటుంది అని అదిరిపోయే సమాధానం ఇచ్చింది.ఇక సమాధానం చూసి జనాలంతా తెగ నవ్వుకుంటున్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆమె ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube