టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు శ్రీకాంత్ (Sreekanth)ఒకరు.ఈయన అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక శ్రీకాంత్ నటి ఊహ(Uhaa) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటే వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను శ్రీకాంత్ ఎప్పుడు ఖండిస్తూ వచ్చారు.ఇక శ్రీకాంత్ దంపతులకు ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.
వీరికి పెద్దబ్బాయి రోషన్(Roshan) ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టారు.ఇక రెండో అమ్మాయి మేధ(Medha) ప్రస్తుత ఈమె ఉన్నత చదువులు చదువుతున్నారు.ఇక చిన్నబ్బాయి పేరు రోహన్(Rohan) .ఇలా తన తన పిల్లలతో కలిసి శ్రీకాంత్ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక శ్రీకాంత్ పెద్ద కుమారుడు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా మరికొద్ది రోజులలో తన కుమార్తె కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టబోతుందంటూ వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం శ్రీకాంత్ కుమార్తెను కనుక చూస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని తెలుస్తోంది.
తాజాగా శ్రీకాంత్ తమ ఫ్యామిలీ వేడుకలో పాల్గొన్నారు.ఈ వేడుకలలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ కలిసి దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో శ్రీకాంత్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఒకేలాంటి పైజామా తో కనిపించగా తల్లి కూతుర్లిద్దరూ చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తున్నారు.ఇక మేధ అయితే బంగారు వర్ణం చీర కట్టుకొని పుత్తడిబొమ్మల మెరిసిపోతుంది.
ఇలా ఈమె ఫోటో చూసినటువంటి నేటిజన్స్ మేధ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెట్టబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం శ్రీకాంత్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.