టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య.ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.మా నాన్నగారిని చూసి నేను ఇన్ని సంవత్సరాలు చూసి ఎంత నేర్చుకున్నాను తెలియదు కానీ మారేడిమిల్లి లో 20 రోజులు దగ్గరగా చూసి నేర్చుకున్న దానితో పోలిస్తే ఈ 20 సంవత్సరాలు నథింగ్ అని అనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన కొరటాల శివకి థ్యాంక్స్ అని చెప్పాడు.
ఆ తర్వాత రాజమౌళి గారు మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట చెబుతాను.
బొమ్మరిల్లు సినిమాలో నాన్నా నా చెయ్యి నీ చేతిలోనే ఇంకా ఉంది అనే డైలాగ్ ప్రకారంగా రాజమౌళి గారి సినిమా సెట్ లోకి ఒక యాక్టర్ వెళితే అతను రాజమౌళి చేతుల్లోనే ఉంటాడు.రిలీజ్ అయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు.
కానీ మొదటి సారి ఆది మోడీ గారు మా నాన్నగారి వాళ్ళ అమ్మ గారి వల్ల డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసి తర్వాత కూడా నా చెయ్యిని పెట్టాడు అని చెప్పుకొచ్చాడు చెర్రీ.అందుకు నా తరఫున మా అమ్మ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపాడు.
అనంతరం మాట్లాడుతూ నేను ఏ ఫిల్డ్ లోకి వెళ్లిన సంపాదించుకోవచ్చు కానీ నేను ఏ ఫీల్డ్ లోకి వెళ్ళలేను.ఎందుకంటే కొంతమంది కుర్రాళ్లు లాగా నేను బాగా చదువుకో లేదు స్కూల్లో ఆచార్యులకు నేను దూరంగా ఉండే వాడిని.
ఇంట్లో ఉన్న మా ఆచార్య నాకు చాలా నేర్పించారు.అని చెప్పుకొచ్చాడు చెర్రీ.

ఎప్పుడు కూడా పెద్దలు ఇంటికొచ్చినప్పుడు మర్యాదగా ఉండు అని మాత్రం చెప్పేవారు.ఆయన చెప్పిన వాటిలో ఇది నాకు బాగా గుర్తుంది.మా ఇంటికి పెద్ద పెద్ద దర్శకులు వచ్చినప్పుడు వారి కాళ్ళకు దండం పెట్టిన వారు అని తెలిపాడు చెర్రీ.ఆయన కొడుకుగా పుట్టి నందుకు ఇది చాలు.
అంతేకానీ ఇది తప్పు ఇలా చేయొద్దు అని చెప్పింది లేదు.అంతేకాకుండా ఒక సినిమా ఫ్లాప్ అయినా ఇంటికి వస్తే ఎప్పుడు కూడా తిట్టలేదు.
అదే నేను తీసిన సినిమా హిట్ అయితే నా దగ్గర, అలాగే నలుగురి దగ్గర నా గురించి గొప్పగా పొగిడేవరు అని తెలిపాడు చెర్రీ.ఆచార్య సినిమా షూటింగ్‌లో భాగంగా నిజంగా 20 రోజులు నాన్నగారితో కలిసి ఉన్నాను.
ఇద్దరు ఉదయం కలిసి లేచేవాళ్లం.కలిసి వ్యాయామం చేసేవాళ్లం.
కలిసి మేకప్‌లు వేయించుకునేవాళ్లం.నిజం ఇది చాలా గొప్ప అవకాశం.
దీన్ని నేను జీవితాంతం మనసులో ఉంచుకుంటాను.ఎమోషనల్ కాకూడదని అనుకున్నా కానీ.
ఆయనతో నాకు ఇలాంటి సందర్భం రావడానికి నాకు 13 ఏళ్లు పట్టింది.మళ్లీ ఇలాంటి అవకాశమే రావాలని నేను కోరుకోను.
ఎందుకంటే నాకు, నా జీవితానికి ఇది చాలు.ఆయన కొడుకుగా పుట్టినందుకు ఇది చాలు.
థాంక్యూ డాడీ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు చెర్రీ.