హై స్పీడ్‌తో.. బెస్ట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌ ఇవే!

బ్రాండ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.కరోనా నేపథ్యంలో వీటి వినియోగం కూడా విపరీతంగా పెరిగింది.

 Here Is The Best Broadband Plans With High Speed. Act Fibernet, Airtel Internet,-TeluguStop.com

వీటిలో ప్రధానంగా యాక్ట్‌ ఫైబర్‌నెట్, టాటాస్కై, జియోఫైబర్, ఎయిర్‌టెల్‌ ఇతర సర్వీసులు ఉన్నాయి.తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్స్‌ అందిస్తున్నాయి.

అది కూడా హై స్పీడ్‌తో కూడింది.అందులో 50 ఎంబీపీఎస్, 100, 150 ఎంబీపీఎస్‌ బ్రాండ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి.అందులో కొన్ని అన్‌లిమిటెడ్‌ డేటా బెనిఫిట్స్, మరికొన్ని ఉచితంగా ఓటీటీ యాక్సెస్‌ కూడా ఇస్తున్నాయి.

యాక్ట్‌ ప్లాన్‌.150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో.

Telugu Fibernet, Airtel, Hath Broad Band, Jio Fiber, Jiofiber-Technology Telugu

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ వివిధ నగరాలకు వివిధ రకాల ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.కానీ, ధరలు ఒకే రకంగా ఉన్నాయి.ఢిల్లీలో రూ.799 ప్లాన్‌ ద్వారా 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నెట్‌ అందిస్తోంది.ఇది ఇతర బ్రాండ్‌బ్యాండ్లతో పోలిస్తే అతి తక్కువ.3 వేల జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్‌ అందించనుంది.ఇది నెలవారీ ప్లాన్‌.జీ5, సోనీ లైవ్, కల్ట్‌.ఫిట్‌ ఉంటుంది.

ఢిల్లీలో 50 లేదా 100 ఎంబీపీఎస్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ అందుబాటులో లేదు.బెంగళూరులో 150 ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.యాక్ట్‌ నెట్‌ ధర రూ.1,085 తో రూ.50 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.దీంతో వెయ్యి డేటాతోపాటు ఒకనెల ఉచితంగా జీ5 సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.50 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.దీని ధర రూ.710.75 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ కూడా ఉంది.దీని ధర రూ.985.

హత్‌వే బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌…

Telugu Fibernet, Airtel, Hath Broad Band, Jio Fiber, Jiofiber-Technology Telugu

హత్‌వేలో 50 ఎంబీపీఎస్‌తో డీఓసీఐఎస్‌ ప్లాన్‌ ఉంటుంది.దీని ధర రూ.2,550, ఇది మూడు నెలలకు వర్తిస్తుంది.అన్‌లిమిటెడ్‌ డేటాతో పాటు ఎఫ్‌యూపీ లిమిట్‌ ఉండదు.100 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.దీని ధర రూ.2,247.ఒక వేళ మీకు ఇంటర్నెట్‌ ప్లాన్‌ కావాలంటే 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ను తీసుకోవాల్సిందే.హత్‌వే డేటా లిమిట్‌ను కంపెనీ ప్రకటించలేదు.150 ఎంబీపీఎస్‌ ప్లాన్‌కు రూ.2,697.3 నెలలకు వర్తిస్తుంది.ఈ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇన్‌స్టాల్‌ చేయించుకోవడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌…

Telugu Fibernet, Airtel, Hath Broad Band, Jio Fiber, Jiofiber-Technology Telugu

టాటా స్కైలో చాలా రకాల బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.50,100,150 ఎంబీపీఎస్‌ ప్లాన్స్‌ అందిస్తోంది.యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ మాదిరిగా ఇది కూడా నగరాలను బట్టి మారుతూ ఉంటుంది.ముంబై, ఢిల్లీ 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.649 కే వస్తుంది.ఇందులో రూ.1,797 ప్లాన్‌ మూడు నెలలకు వర్తిస్తుంది.ఇందులో ఇన్‌స్టాలేషన్‌కు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.కానీ, జీఎస్ట్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

జియో ఫైబర్‌ ప్లాన్స్‌.

Telugu Fibernet, Airtel, Hath Broad Band, Jio Fiber, Jiofiber-Technology Telugu

ఇందులో 30 ఎంబీపీఎస్‌ లేదా 100 ఎంబీపీఎస్‌ కేవలం రూ.800 లోపే లభిస్తుంది.30 ఎంబీపీఎస్‌కు రూ.399 చెల్లిస్తే సరిపోతుంది.100 ఎంబీపీఎస్‌కు రూ.699 చెల్లించాలి.అదనపు జీఎస్టీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.రూ.999 ప్లాన్‌తో 14 స్ట్రీమింగ్‌ యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు.ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్, డిస్నీ హాట్‌స్టార్, సోనీ లైవ్, జీ5 ప్రీమియం, వూట్‌ సెలెక్ట్, వూట్‌ కిడ్స్, సన్‌ నెక్స్‌›్ట, అల్ట్‌ బాలాజీ, డిస్కవరీ ప్లస్, ఎరోస్‌ నౌ, జియో సినిమా, లయన్స్‌ గేట్, షిమరూమి, హయ్‌చయ్‌ అందిస్తుంది.ఈ ప్లాన్‌ ద్వారా 3,300 జీబీ డేటా నెలవారీగా అందిస్తుంది.

ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ట్రీం…

Telugu Fibernet, Airtel, Hath Broad Band, Jio Fiber, Jiofiber-Technology Telugu

150 ఎంబీపీఎస్‌ ప్లాన్‌తోపాటు 40,100,200,300 ఎంబీపీఎస్‌ డేటా ఉంటుంది.100 ఎంబీపీఎస్‌ ధర రూ.799 మాత్రమే.ఓటీటీ కంటెంట్‌ కూడా ఉచితంగా పొందవచ్చు.ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీంలో దాదాపు పదివేల సినిమాలు, షోలు ఉండనున్నాయి.40 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ కేవలం రూ.499 కే అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube