మేము విడిపోయామని ఎలా అనుకుంటారు.. హేమా మాలిని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని( Hema Malini ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తాజాగా ఈ నటి ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 Hema Malini Comments Goes Viral In Social Media Details Here Goes Viral In S-TeluguStop.com

తమ కుటుంబం గురించి ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వస్తున్న వార్తల గురించి హేమా మాలిని తాజాగా రియాక్ట్ అయ్యారు.తన భర్త ధర్మేంద్ర( Dharmendra ), మొదటి భార్య కుటుంబంతో తాము కలిసే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చారు.

మేము విడిపోయామని బయటి వాళ్లు అనుకోవడం కామెడీగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ధర్మేంద్ర మొదటి భార్య కుటుంబంతో మేము ఎప్పుడూ కలిసే ఉన్నామని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ ఫ్యామిలీ మాతోనే ఉందని హేమా మాలిని చెప్పుకొచ్చారు.కొన్ని కారణాల వల్ల మేము సన్ని కొడుకు పెళ్లికి హాజరు కావడం సాధ్యం కాలేదని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Bobby, Dharmendra, Hema Malini, Raksha Bandhan, Sunny, Tollywood-Movie

అది వేరే విషయమని ఆ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని ఆమె చెప్పుకొచ్చారు.రక్ష బంధన్( Raksha Bandhan ) పండుగ సమయంలో సన్నీ, బాబీ ( Sunny, Bobby )మా ఇంటికి వస్తుంటారని ఆమె కామెంట్లు చేశారు.నా పిల్లలు వాళ్లకు రాఖీ కడుతుంటారని ఇది మాకు కొత్త విషయం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.హేమా మాలిని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Bobby, Dharmendra, Hema Malini, Raksha Bandhan, Sunny, Tollywood-Movie

హేమా మాలిని క్లారిటీతో ఇకనైనా ఈ కామెంట్లు ఇకనైనా ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.1980 సంవత్సరంలో ధర్మేంద్ర హేమా మాలిని వివాహం జరిగింది.ధర్మేంద్ర హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నారు.ధర్మేంద్ర మొదటి భార్య కుమారుడు సన్నీ ఇంట తాజాగా జరిగిన వేడుకకు హేమా మాలిని ఫ్యామిలీ హాజరు కాలేదు.

హేమా మాలిని ఫ్యామిలీ తీరుపై విమర్శలు రావడంతో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube