సేఫ్ బైక్ రైడ్ కోసం ఓ వ్యక్తి అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్( Ultrasonic Dog Repellent ) అనే డివైజ్‌ను డెవలప్ చేశాడు.దీని ప్రత్యేకత ఏమిటంటే, కుక్కలు బైక్‌ను ఛేజ్ చేయకుండా ఇది కంట్రోల్ చేయగలదు.
సాధారణంగా భారతదేశంలోని చాలా నగరాల్లో వీధి కుక్కల( Street dog ) బెడద రోజురోజుకీ మితిమీరుతోంది.
ఇటీవల కాలంలో అయితే వీటి దాడులు మరీ ఎక్కువ అయ్యాయి.ఇవి సైకిల్లు, మోటార్‌సైకిల్స్‌పై వెళ్లే వారిని కూడా తరుముతూ వాహనదారులకు హడల్ పుట్టిస్తున్నాయి.ఇక బాటసారుల కష్టాలు గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఈమధ్య కాలంలో కొంతమంది చిన్నపిల్లలను చంపేసిన ఘటనలు కూడా చూసాం.
కాగా ఈ సమస్యకు ఒక వ్యక్తి అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాడు.సేఫ్ రైడ్ కోసం అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ అనే డివైజ్‌ను డెవలప్ చేశాడు.అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ డివైజ్ అనేది హై-ఫ్రీక్వెన్సీ( High-frequency ) శబ్దాలను విడుదల చేస్తుంది.
తద్వారా బైక్ నడుపుతున్నప్పుడు కుక్కలు రైడర్ వద్దకు రాకుండా లేదా దాడి చేయకుండా నివారిస్తుంది.ఈ అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ అనేది రైడర్ బైక్‌కి వెనుక భాగంలో పెట్టుకోవాలి.
ఈ డివైజ్ మానవ వినికిడి పరిధికి మించిన హై-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను రిలీజ్ చేస్తుంది.ఇది కుక్కలకు పెద్దగా వినిపిస్తుంది కానీ మనుషులకు తీవ్రంగా వినిపించదు.
దాంతో ఈ ఫ్రీక్వెన్సీకి కుక్కలు భయపడిపోయి వాహనదారులను తరమడం మానేస్తాయి.అప్పుడు బైకర్ సురక్షితంగా, భయం లేకుండా ఏ వీధి కుక్కల ముందు నుంచైనా ప్రయాణం చేయొచ్చు.ఈ డివైజ్ జంతువులకు ఏ విధంగానూ హాని కలిగించదు, కానీ దూకుడుగా ఉండే వీధి కుక్కల సమస్యకు సురక్షితమైన, మానవీయమైన పరిష్కారాన్ని అందిస్తుంది అని నిపుణులు అంటున్నారు.