కేవలం రూ.35 కోసం 5 ఏళ్ళు యుద్ధం చేశాడు... తద్వారా 3 లక్షలమంది లబ్ది పొందారు!

ఇక్కడ వున్న కధనం కాస్త విడ్డురంగా వున్నా, చాలామందికి లాభమే చేకూరింది.మనలో అనేకమంది రు.100లోపు రూపాయిలను అస్సలు పట్టించుకోరు.ఏదన్నా ఓ షాపు వాడు ఓ 5 రూపాయిలు లేదంటే, మరేం పర్వాలేదు అంటూ వెనక్కి వచ్చేస్తూ వుంటారు.

 He Fought For 5 Years For Just Rs.35 So That 3 Lakh People Benefited , 35rs, Fig-TeluguStop.com

ఇలాంటి సందర్భాలెన్నో ఉంటాయి.చాలామంది సింగిల్ రూపాయి లేదని, తరువాత ఇస్తామని చాలా క్యాజువల్ గా చెప్పేస్తారు.

మనం కూడా అంతే క్యాజువల్ గా తీసుకుంటాం.అయితే కొందరుంటారు.

వారికి రూపాయి కూడా లెక్కే.వారు రూపాయిని కూడా గౌరవిస్తారు.

సరిగ్గా అలాంటి సంఘటన గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.

రైల్వే టికెట్‌పై రావాల్సిన రూ.35 రీఫండ్‌ కోసం ఓ వ్యక్తి సుమారు 5 ఏళ్లపాటు చేసిన పోరాటం, సుమారు 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది.వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఇంజినీర్‌ సుజీత్‌ స్వామి 2017 జులై 2న కోట నుంచి దిల్లీకి ప్రయాణించేందుకు IRCTC ద్వారా ఏప్రిల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.ఆ టికెట్‌ ధర రూ.765 కాగా, కొన్ని అనివార్య కారణాలవలన ప్రయాణాన్ని రద్దు చేసుకోగా.క్యాన్సిలేషన్‌ రుసుము కింద రూ.65 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.100 మినహాయించుకున్నారు IRCTC వారు.దాంతో రూ.35 వసూలు చేయడంపై స్వామి వారితో పెద్ద యుద్ధమే చేసాడు.

దీనికోసం రైల్వేకు, IRCTCకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద సుమారు 50 అర్జీలు పెట్టారు.దీంతో ఆఖరికి IRCTCవారు దిగివచ్చి, రూ.35 తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది.కానీ, 2019 మే 1న అతని బ్యాంకు ఖాతాలో రూ.33 మాత్రమే జమయ్యాయి.మిగిలిన రూ.2లను కూడా స్వామి పట్టుబట్టారు.దాని కోసం మరో 3 సంవత్సరాలు పాటు పోరాడారు.దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన రైల్వే.2.98 లక్షల మంది వినియోగదారులకు ప్రతి టికెట్‌పై రూ.35 చొప్పున మొత్తం రూ.2.43 కోట్ల రీఫండ్‌ చెల్లించేందుకు అంగీకరించింది.ఆ రకంగా 3 లక్షల మందికి లబ్ది చేకూరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube