కాంగ్రెస్ వ్యూహం ఫలించిందా.. అదే విజయనికి కారణమా ?

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) చక్రం తిప్పింది.ఎవరు ఊహించని విధంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని వేరే పార్టీ అండ లేకుండానే ప్రభుత్వాన్ని స్థాపించనుంది.

 Has The Strategy Of Congress Succeeded, Congress , Karnataka Assembly Election ,-TeluguStop.com

మొదటి నుంచి కూడా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వివిద సర్వేలు, విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు.కానీ మెజారిటీ సర్వేలు అలాగే ఈ మద్య వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హంగ్ ఏర్పడుతుందని చెబుతూ వచ్చాయి.

అయినప్పటికి విజయం పై హస్తం పార్టీ మొదటి నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూనే వచ్చింది.మ్యాజిక్ ఫిగర్ దాటడమే కాకుండా 130 నుంచి 140 కైవసం చేసుకుంటామని హస్తం నేతలు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు.

మొత్తానికి హస్తం నేతల మాటే నెగ్గింది.

Telugu Congress, Karnataka, Rahulgandhi-National News

బిజెపి, జెడిఎస్( JDS ) పార్టీలకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ ఏకంగా 136 స్థానాల్లో సత్తా చాటింది.దీంతో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన హస్తంపార్టీ సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.అయితే ఈ స్థాయిలో కాంగ్రెస్ విజయనికి దోహదం చేసిన అంశాలు ఏవి అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.

ముఖ్యంగా బిజెపిపై ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ కు ప్లేస్ అయిందనే వాదన నడుస్తోంది.తాము బలం పెంచుకోవడం అంటే ఎదుటివారిని బలహీన పరచడమే అనే వ్యూహాన్ని కాంగ్రెస్ గట్టిగా అమలు చేసి బీజేపీని సెంటిమెంట్ తో దెబ్బకొట్టిందని చెబుతున్నారు విశ్లేషకులు.2018 లో బీజేపీ ప్రభుత్వం స్థాపించిన తరువాత బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది.అంతే కాకుండా బీజేపీ అక్రమ పాలన సాగిస్తుందనే విషయం కూడా కన్నడ ప్రజలకు బాగానే బోదపడింది.

Telugu Congress, Karnataka, Rahulgandhi-National News

దాంతో ఇదే అంశాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్.బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, నియంత పాలన సాగిస్తుందని, ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు కూల్చి ఇష్టానుసారంగా పాలన సాగిస్తారని కమలనాథులపై రకరకాల విమర్శల దాడి చేసింది కాంగ్రెస్.అంతేకాకుండా బీజేపీ నేతల అవినీతిని కూడా తెరపైకి తీసుకు రావడంలో సక్సస్ అయి కాషాయ పార్టీని బలహీన సెంటిమెంటల్ గా బలహీన పరిచింది కాంగ్రెస్.ఇదే టైమ్ లో రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపట్టి కన్నడ ప్రజలకు మరింత దగ్గరవ్వడంతో కన్నడిగుల దృష్టి కాంగ్రెస్ పై పడింది.

ఇక అక్కడి ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపొందించి, రైతు చట్టాలను అమలు చేస్తామని, 24 గంటలు కరెంట్ ఇస్తామని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి ప్రజలకు దగ్గరైంది కాంగ్రెస్.ఫలితంగా ఎన్నికల్లో హస్తం పార్టీ కి బ్రహ్మరథం పట్టారు కన్నడ ప్రజలు.

దీంతో కన్నడనాట పూర్తి ఆధిక్యం ప్రదర్శించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్.ఆ విధంగా హస్తం పార్టీ వ్యూహాలు రచించి బీజేపీకి( BJP ) చెక్ పెట్టిందనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube