భారతీయులు అన్ని రంగాలలో నిష్టాతులేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే ప్రపంచ దేశాలు నిష్ణాతులైన భారతీయులకి అధిక జీతభత్యాలు ఇస్తూ తమ దేశాల అభివృద్దికి ఉపయోగించుకుంటూ ఉంటాయి.
ఐటీ, విద్యా , వైద్య , న్యాయశాస్త్రం ఇలా ఏ రంగంలోనైనా భారతీయులకి భారతీయులే సాటి.తాజాగా భారత సంతతికి చెందిన హరీష్ సాల్వే బ్రిటన్ రాణి ఆస్థాన న్యాయవాదిగా నియమితులు అవ్వడమే అందుకు నిదర్శనం.
భారత మాజీ జనరల్ హరీష్ సాల్వే ఇంగ్లాండ్మ్, వేల్స్ కోర్టులకి క్వీన్ కౌన్సిల్ సభ్యునిగా నియామకం అయ్యారు.అంటే బ్రిటన్ మహారాణి ఆస్థాన న్యాయవాదిగా ఆయన నియమితులు అయ్యారు.
ఈ పదవిని ఆయన మార్చి 16 వ తారీకున చేపట్టనున్నారు.అసామాన్య ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఈ అరుదైన గుర్తింపు లభిస్తుందని అంటున్నారు నిపుణులు.
అంతేకాదు వీరికి బ్రిటన్ లో ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా ఇస్తారట.ఇదిలాఉంటే.
సాల్వే నాగపూర్ యూనివర్సిటీ నుంచీ న్యాయవాద పట్టా పొందారు.1992 నుంచీ ఢిల్లీ హై కోర్ట్ లో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు.అలాగే 2002 వరకూ కూడా భారత సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేశారు.అంతేకాదు కులబూషణ్ యాదవ్ కేసుని భారత దేశం తరుపున వాదించారు.ఈ కేసులో పాక్ కి వ్యతిరేకంగా వాదించి గెలవడంతో ఆయన భారత్ కి ఘనవిజయం సాధించి పెట్టారు.