నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.2012 లో చోటుచేసుకున్న ఈ ఘటన లో నలుగురు నిందితులకు ఉరిశిక్షలను ఖరారు చేస్తూ ఇటీవల పటియాలా కోర్టు తీర్పు వెల్లడించింది.అయితే ఈ నెల 22 న వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా,నిందితుల్లో ఒకరు రాష్ట్రపతి కి మెర్సీ పిటీషన్ దాఖలు చేశారు.దీనితో రాష్ట్రపతి వారి పిటీషన్ ను తిరస్కరించడం తో వారి ఉరిశిక్ష తేదీని ఫిబ్రవరి 1 వ తేదీ కి ఖరారు చేశారు.అయితే ఈ క్రమంలో నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ సంచలన సూచన చేశారు.2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా కొట్టి హతమార్చిన నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించకుండా తల్లిగా క్షమించాలని ఆమె కోరారు.నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించడంతో ఫిబ్రవరి 1వతేదీన వారిని ఉరి తీయాలని నిర్ణయించిన దృష్ట్యా మహిళా న్యాయవాది నిర్భయ తల్లికి ఈ పిలుపునిచ్చారు.
‘‘నిర్భయ హత్యాచారం అనంతరం ఆమె తల్లి పడే బాధ ఎలాంటిదో నాకు తెలుసు…కాని,1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని సోనియాగాంధీ క్షమించి, ఉరి శిక్ష విధించవద్దని కోరారు, సోనియాను ఆదర్శంగా తీసుకొని దోషులను ఉరి తీయకుండా నిర్భయ తల్లి క్షమించి వదిలివేయాలి’’ అని మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచించారు.
అయితే నిర్భయ తల్లి మాత్రం నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేవరకూ తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు.







