రోహిత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తిన హర్భజన్ సింగ్.. అలాంటి వ్యక్తి అంటూ..!

భారత టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ పై అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తూ టీం ను ముందుకు నడిపిస్తున్నాడు.

 Harbajan Singh Interesting Comments On Rohith Sharma Details, Harbajan Singh ,in-TeluguStop.com

సరికొత్త ప్లాన్లు రూపొందించుకొని ప్రత్యర్థి టీం ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు.ఇక తాజాగా హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

రోహిత్ శర్మ మంచి కెప్టెన్ మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసలు కురిపించాడు.

Telugu Rohith Sharma, Cricket, Cricketerrohith, Harbajan Singh, Mahendrasingh-Sp

2007 టీ 20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మను కలిసిన హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ పై తనకున్న అభిప్రాయాన్ని ఇటీవలే బయటపెట్టాడు.రోహిత్ ముంబై స్టైల్ లో మాట్లాడుతుంటే అతని వైపు అలాగే చూస్తూ ఉండేవాడినని, బస్సులో తన వెనకాల సీటులో రోహిత్ కూర్చునేవాడని, దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 ప్రపంచ కప్ లో మొదటిసారి రోహిత్ శర్మ జట్టులో చేరాడని తెలిపాడు.మొదట్లోనే రోహిత్ శర్మ ఆటతీరు చూసి ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తాడని, తాను అనుకున్నట్లు హర్భజన్ సింగ్ తెలిపాడు.

Telugu Rohith Sharma, Cricket, Cricketerrohith, Harbajan Singh, Mahendrasingh-Sp

ప్రస్తుతం బ్యాట్ మెన్, టీం కెప్టెన్ గా ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.ఇక ధోని, రోహిత్ శర్మ ల కంటే బెస్ట్ కెప్టెన్ ఐపీఎల్ లో మరొకరు లేరని అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ తనకంటూ ఒక ప్రత్యేక రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడని, ఇంకా టీం నడిపించే తీరు ఎంతో బాగుంటుందని ప్రశంసలతో ముంచెత్తాడు.ప్రస్తుతం హర్భజన్ సింగ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

క్రికెట్ అభిమానులు హర్భజన్ మాటలకు కామెంట్స్ రూపంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube