కార్గిల్ యోధులకు జేజేలు..

భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయానికి ప్రతీకగా ” కార్గిల్ విజయ్ దివాస్” గా ప్రతీ సంవత్సరం జూలై 26వ తేదీన జరుపుకుంటూ, అమరజవాన్లుకు జేజేలు తెలుపుతూ, వారి త్యాగాలను మననం చేసుకునే రోజుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుపుకుంటారు.‌ ఈ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు, యుద్ధ నైపుణ్యాలు ప్రదర్శించి, మనదేశానికి విజయం చేకూర్చిన సైనిక యోధులకు క్రృతజ్ఞతలు తెలుపుకుంటాం.

 Hail To Kargil Warriors Kargil Vijay Divas Details, Kargil Warriors, Kargil Vija-TeluguStop.com

‌ దేశంకోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు ప్రతీ సంవత్సరం ఈరోజున దేశ రాజధాని ఢిల్లీలో “ఇండియా గేట్ వద్ద ఉన్న అమరజవాన్ల జ్యోతి” వద్ద ప్రధానమంత్రి పుష్పగుచ్చం ఉంచి, నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాలను స్మరిస్తారు.‌

పాకిస్థాన్ ప్రేరేపిత ఈ యుద్ధంలో , మన త్రివిధ దళాల సైనికులు చూపిన అసమాన ప్రతిభా పాటవాలు, శత్రువుని వెన్నువిరిచి, ఒంటిచేత్తో విజయాన్ని అందుకున్న రోజు ఈ కార్గిల్ విజయ్ దివాస్.

‌ దేశ‌‌ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూ, ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ, చొరబాటు దారులను ప్రోత్సాహిస్తున్న పాకిస్తాన్ ను, నిరంతరం మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, దేశభధ్రతకే నిలబెడుతూ చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి.మనలను, దేశాన్ని కాపాడుతూ కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలను అర్పిస్తున్నారు.

‌ శ్రీనగర్ కు 205 కి.మీ దూరంలో ఉన్న -45 డిగ్రీల ఉష్ణోగ్రత అతి శీతల ప్రాంతం కార్గిల్ ప్రాంతంలో చేసిన యుద్ధం అసామాన్య మైనది.1999 ఫిబ్రవరి లో ఇరుదేశాలు శాంతి స్థాపనకు “లాహోర్ డిక్లరేషన్” చేసిన, కొన్ని రోజులకే ఈ యుద్ధం సంభవించటం పాకిస్థాన్ కపటబుద్దికి పరాకాష్ట.తన వక్రబుద్ధి‌తో పాకిస్థాన్ సైన్యం, చొరబాటుదారులు వాస్తవాధీన రేఖ దాటి,‌‌ కాశ్మీర్ కు లడాఖ్ మధ్య భారత సంబంధాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.‌

Telugu India, Indian, Kargil Warriors, Lahore, Vijay, Pakistan, Tiger Hills-Late

సుమారు 120 కి.మీ భారతభూభాగంలో ప్రవేశించారు.గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో సైనికులు కదిలి, పై ఉన్నతాధికారులు ద్రృష్టిలో ఉంచి, లోతుగా అధ్యయనం చేసిన అనంతరం వారిని తరిమి, తిరిగి మన భుభాగం పొందే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లక్ష్యంతో ” ఆపరేషన్ విజయ్” పేరుతో యుద్ధ శంఖారావం పూరించారు.‌ సుమారు 2లక్షల సైనికులుతో కదనరంగాన దూకి,‌‌ సుమారు అరవై రోజులు సాగిన యుద్ధంలో భారత్ 527 మంది సైనికులను కోల్పోయి, 1999 జూలై 26న కార్గిల్ ఎతైన శీతల పర్వత ప్రాంతంలో “టైగర్ హిల్స్ “పాయింట్ 5140 పై జాతీయ జెండా ఎగురవేసి, భారత్ విజయం సాధించింది అని మనసైన్యం ప్రకటించారు.

పాకిస్థాన్ సైన్యాన్ని, చొరబాటు దారులను ఓడించారు.‌ పాక్ సైనికులు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు.1000 మందికి పైగా గాయాలు పాలైనారు.

Telugu India, Indian, Kargil Warriors, Lahore, Vijay, Pakistan, Tiger Hills-Late

1947, 1965, 1971లో పాకిస్థాన్ మన చేతుల్లో ఓటమి పాలైనా, నేటికీ తన వంకరబుద్ది చూపెడుతుంది.ఇటీవల ” డ్రోన్లు”తో అలజడికి కారణం అవుతుంది.అనేక మంది భారత సైనికులు పహారాలో మనం , మన దేశం సురక్షితంగా ఉంటుంది అనుటలో సందేహం లేదు.

ఎందరో సైనికులు తమ ప్రాణాలను దేశం కోసం అనేక సందర్భాల్లో త్యాగం చేస్తున్నారు.వారి త్యాగాలను భారతీయులం అయిన మనం అందరం ఎల్లవేళలా స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనం, మన ప్రభుత్వాలు అండగా ఉంటాయి అని తెలపటమే ఈ కార్గిల్ విజయ్ దివాస్ పరమార్థం.

పాకిస్థాన్ తన కపటబుద్దికి స్వస్తి చెప్పి, మనకు స్నేహ హస్తం అందించాలని ఆశిద్దాం.శాంతి మార్గాలు ద్వారా ఇరు దేశాలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube