అమెరికా ప్రభుత్వ ట్రంప్ విధానాల వలన హెచ్ -1 బీ వీసా నిభందనలు ఎంతో కటినతరం అయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నిభంధాలని ఖటినతరం చేసిన తరువాత దాని ప్రభావం భారత ఐటి కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపడమే కాకుండా భారత ఐటీ కంపెనీ మార్జిన్ల పై కూడా ప్రభావం చూపింది.ఇదే విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది…అమెరికా కొత్త నిభంధనల్ని పాటించడం అమెరికాలో స్థానికులకి ప్రయారిటీ ఇవ్వడం వలన ఈ పరిణామాలని ఎదుర్కోక తప్పదని తెలిపింది.?
హెచ్-1బి వీసాలపై కంపెనీలు ఎంత మేరకు ఆధారపడుతున్నాయో ఆ మేరకు ప్రభావం ఉంటుందని అయితే నిభంధనల్లో మార్పులతో ప్రస్తుతం హెచ్-1బి వీసాలకు అర్హమైన కొన్ని స్థాయిలు అర్హతను కోల్పోయే అవకాశం ఉందని.దాని ఫలితంగా దీని మూలంగా భారత్ నుంచి నియామకాలు తగ్గే ఆస్కారం ఉన్నట్టు ఇక్రా కార్పొరేట్ సెక్టార్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ తెలిపారు…అంతేకాదు తాజాగా ట్రంప్ ఈ వీసా విధానం పై మాట్లాడుతూ మేము అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులని మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాము అని తెలిపాడు.
ఇదిలాఉంటే హెచ్-1బి వీసాలపై భారత్కు చెందిన ఉద్యోగులతో అమెరికాలో మన కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.ఈ తరుణంలో అమెరికాలోని ఉద్యోగులతో పోల్చితే హెచ్-1బి వీసాలపై ఆధారపడిన కంపెనీలోని ఉద్యోగుల వేతనం దాదాపు 25 శాతం తక్కువగా ఉంటుందని హెచ్-1బి వీసాపై అమెరికాలో 15 శాతంకన్నా ఎక్కువ మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తుంటే ఆ కంపెనీ హెచ్-1బి వీసాలపై ఆధారపడిన కంపెనీ కిందకు వస్తుంది.
అత్యధిక నైపుణ్యాలు లేదా అధిక పారితోషికం ఆధారంగా హెచ్-1బి వీసాలను జారీ చేస్తే అలాంటి వీసాలను భారత కంపెనీలు పొందడానికి తక్కువ అవకాశం ఉంటుందని జైన్ చెబుతున్నారు.వారికి అధిక వేతనాలు చెల్లిస్తే ఆమేరకు కంపెనీ మార్జిన్లపై ప్రభావం తప్పదని చెప్పారు.
ఇది కంపెనీలకు ప్రతికూలమేనని అన్నారు…మరి ఈ సందిగ్ధం నుంచీ భారత ఐటీ కంపెనీలు ఎలా బయటపడుతాయి అనేది తేలాల్సి ఉంది.ఏదేమైనా ట్రంప్ విధానాల వలన భారత ఐటీ వ్యవస్థ తీవ్ర సంక్షేభం లోకి నేట్టబడుతుంది అనడానికి ఇదొక నిదర్సనం అంటున్నారు ఐటీ నిపుణులు.