ఇదెక్కడి చోద్యం గురూ... ఆ పెళ్ళిలో అప్పడం కోసం నానారాద్ధాంతం చేసారు!

మనదేశంలో పెళ్లిళ్లకు ఎక్కడలేని సందడి కనబడుతుంది.జీవితంలో ఒక్కసారే చేసుకున్నది కాబట్టి ఎవరి వారు వారి తహతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటారు.

 Guests Fight In Kerala Wedding For Appadam Details, Marriage, Bride, Groom, Papa-TeluguStop.com

ఈమధ్య మరీను… ముఖ్యంగా భోనజాల విషయంలో ఎవరూ తగ్గట్లేదు.ఒక పెళ్లిలో భోజనం బాగుంటే ఆ పెళ్లి సక్సెస్ అయినట్టే.

అందుకే పెళ్ళికి ఓ నెలరోజుల ముందే పెళ్లి భోజనం మెనూని తయారు చేసుకుంటారు.ఇక ఆ పెళ్లి దగ్గరలో ఇంకెవరన్నా పెళ్లి పెట్టుకొని సదరు మెనూలోని ఐటమ్స్ కవర్ చేస్తే, వెంటనే తమ మెనూని మార్చేసుకుంటారు.

అంత కాంపిటేషన్ ఉంటుంది నేటి పెళ్లిళ్లకు.

ఇకపోతే, అలాంటి ఓ పెళ్లి భోజనాల దగ్గరే వచ్చింది అసలు చిక్కు.

కేరళలో ఓ పెళ్లిలో ఇలాంటి సంఘటనే స్థానికంగా కామెడీ అయిపోయింది.అప్పడం మళ్లీ రెండోసారి పెట్టలేదనే నెపంతో నానారచ్చచేసారు.

వివరాల్లోకి వెళితే, కేరళలోని అలప్పుజలో తాజాగా ఒక పెళ్లి తంతు జరిగింది.పెళ్లి విందులో రకరకాల భోజన పదార్థాలతో పాటు పప్పడం కూడా వడ్డిస్తున్నారు.

అప్పడం బాగుందో ఏమో మరి, విందులో కూర్చున్న ఒక వ్యక్తి ముందుగా వేసిన అప్పడాన్ని కారకరా నమిలేసి, మళ్లీ ఇంకొకటి కావాలని అడిగాడు.వడ్డన చేసేవాళ్ళు దానికి ససేమిరా అనడంతో ‘అప్పడం అడిగితే వేయరా?’ అంటూ కోపంతో ఊగిపోతూ గోడవకు దిగాడు.

Telugu Alappuza, Appadam, Furniture, Groom, Kerala, Papad-Latest News - Telugu

ఇక ఆయనకు మద్దతుగా మరికొందరు అతిథులు తోడవ్వడం ఇక్కడ కొసమెరుపు.దాంతో వారు తాగున్నారో ఏమో గాని, హాలులో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ నానా హంగామా చేశారు.ఈ గొడవ కారణంగా ఆడిటోరియంలోని దాదాపు 1.5 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ ధ్వంసమైంది.కాగా ఆడిటోరియం యజమాని మురళీధరన్ తో పాటు జోహాన్, హరి అనే మరో ఇద్దరు అతిథులు గాయపడ్డారు.అంతే కాకుండా ఆడిటోరియం యజమాని మురళీధరన్ ఇచ్చిన ఫిర్యాదుతో గొడవకు సంబంధించి 15 మందిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube