తమిళనాడులోనూ గవర్నర్ పంచాయతీ బయటపడింది.రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య వార్ రోజు రోజుకీ మరింత ముదురుతోంది.
ఇందులో భాగంగా గవర్నర్ ఆర్ఎన్ రవిను వెంటనే బర్తరఫ్ చేయాంటూ సీఎం స్టాలిన్ రాష్ట్రపతికి లేఖ రాశారు.ప్రభుత్వాన్ని పని చేయనీకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
గవర్నర్ పదవిలో ఉండేందుకు ఆర్ఎన్ రవి అనర్హులని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.గవర్నర్ రవి రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించారని, మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.ఇప్పటివరకు గవర్నర్ వద్ద 20 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సర్కార్ వెల్లడించింది.