భారతీయ హిందువులకి గోవు అంటే ఎంతో పరమ పవిత్రమైన జంతువుగా కొలుస్తారు.ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తలు.
ఫీటాది పతులు గోవులకోసం ఎన్నో గోశాలని నిర్మిస్తుంటారు.సంకర జాతి గోవుల కంటే కూడా దేశీయ గోవులని ఎక్కువగా పూజిస్తారు…వాటి సరక్షణకి ఎన్నో చర్యలు తీసుకుంటారు.
అయితే అమెరికాలో కూడా భారతీయ సాంప్రదాయ జాతులని రక్షించుకునే ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
అయితే మెంఫిస్ లో శ్రద్ధ సబూరి సమిధ ధార్మిక సంస్థ ఓ భారీ గోశాలని ఏర్పాటు చేసింది.ప్రస్తుతం భారతదేశం నుంచి వచ్చిన గుజరాత్ గిర్ ఆవులు అక్కడ 80 పైగా వున్నాయి.ధనాపేక్ష లేకుండా ఈ గోశాలని వారు నిర్వహిస్తున్నారు.2019 ప్రారంభం నాటికీ 108 ఆవుల్ని సంరక్షించాలన్నది ఈసంస్థ వారి ఉద్దేశం.
నవంబర్ 17 న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గోశాలని ప్రత్యేకంగా చూడటానికి ,ముఖ్యంగా పిల్లలు వారి తల్లితండ్రులతో కలసి అరటిపళ్ళు, క్యారట్లు వంటి ఆహరం గోవులకి ఇచ్చే ఏర్పాట్లు భారీ ఎత్తున చేపడుతున్నారు.అంతేకాదు అక్కడికి వచ్చిన సందర్సకులకి ఆరోజున మధ్యాహ్నం ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.