ఐఫోన్‌నే బీట్ చేసిన గూగుల్ పిక్సెల్ 8 ఫోన్స్.. బెస్ట్ డిస్‌ప్లే గల ఫోన్లుగా రికార్డు బద్దలు..

స్మార్ట్‌ఫోన్ కెమెరాలు, డిస్‌ప్లేలను పరీక్షించి, రేట్ చేసే సంస్థ డీఎక్స్‌ఓమార్క్ (DxOMark) సంస్థ తాజాగా ప్రపంచంలోనే బెస్ట్ డిస్‌ప్లే( Best Display ) గల స్మార్ట్‌ఫోన్లు ఏవో వెల్లడించింది.DxOMark ప్రకారం, గూగుల్ పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.

 Google Pixel 8 Pro Pixel 8 Have The Best Display Among All Phones Details, Smart-TeluguStop.com

ఈ మొబైల్స్ రీసెంట్ గానే లాంచ్ అయ్యాయి.అయితే ఇవి యాపిల్ ఐఫోన్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 కంటే మెరుగైన ఫీచర్లతో లాంచ్ అయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

డీఎక్స్‌ఓమార్క్ సంస్థకు చెందిన నిపుణులు, ఇటీవల పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 డిస్‌ప్లేలను పరీక్షించారు.వారి డేటాబేస్‌లో ఇప్పటిదాకా ఇతర ఏ మొబైల్స్ డిస్‌ప్లేలు కూడా కనబరిచిన గొప్ప సామర్థ్యాన్ని పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు( Google Pixel 8 ) కనబరిచాయి.

అందుకే వాటిని ఉత్తమంగా నిపుణులు ప్రకటించారు.

అంటే పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 డిస్‌ప్లేలు మార్కెట్లో ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేల కంటే బ్రైట్‌గా, షార్ప్‌గా, మరింత కలర్ యాక్యురసీగా ఉంటాయి.

పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 డిస్‌ప్లేల కొన్ని ముఖ్య ఫీచర్ల గురించి తెలుసుకుంటే.

Telugu Accurate Color, Dxomark, Google Pixel, Peak Brightness-Latest News - Telu

హై బ్రైట్‌నెస్:

పిక్సెల్ 8 ప్రో( Google Pixel 8 Pro ) పీక్ బ్రైట్‌నెస్ 2400 నిట్స్, పిక్సెల్ 8 గరిష్ట ప్రకాశం 2000 నిట్స్.దీనర్థం డిస్‌ప్లేలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

హై రిజల్యూషన్:

పిక్సెల్ 8 ప్రో QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.పిక్సెల్ 8 FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.దీనర్థం డిస్‌ప్లేలు చాలా పిక్సెల్‌లను కలిగి ఉంటాయి, ఇది టెక్స్ట్, ఇమేజ్‌లను చాలా షార్ప్‌గా కనిపించేలా చేస్తుంది.

Telugu Accurate Color, Dxomark, Google Pixel, Peak Brightness-Latest News - Telu

కలర్ యాక్యురసీ:

పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 డిస్‌ప్లేలు చాలా కచ్చితమైన రంగు ప్రొడ్యూస్ చేస్తాయని DxOMark కనుగొంది.డిస్‌ప్లేలలో రంగులు( Display Colors ) సహజంగా, వాస్తవికంగా కనిపిస్తాయని దీని అర్థం.

మొత్తంమీద, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.అవి వీడియోలను చూడటం, గేమ్‌లు ఆడటం, వెబ్‌ని బ్రౌజ్ చేయడం వంటి అనుభవాలను వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube