ఇండియా – పాకిస్థాన్( India – Pakistan ) మధ్య ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.దీనిని చూసేందుకు కనీవినీ ఎరుగని రీతిలో అభిమానులు స్టేడియంకి వచ్చారు.
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు విపరీతమైన అల్లరి కూడా చేశారు.వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే స్టాండ్స్‌లో ఒక యువకుడు, మహిళా పోలీసు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది.
ఈ వీడియో ప్రకారం మహిళా పోలీసు స్టాండ్స్‌లో కూర్చున్న ఒక వ్యక్తిని తిట్టింది, అతడు ఏ విషయంలో తప్పు చేశాడో అరిచింది దానికి ఓకే చెప్పకుండా సదరు యువకుడు కోపంగా, ఆమెతో తిరిగి మాట్లాడాడు.ఎగతాళి కూడా చేస్తూ ఆమెను రెచ్చగొట్టాడు.
దాంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన పోలీసు అధికారి అతనిని చెంపదెబ్బ కొట్టింది.ఆ దెబ్బతో ఆ యువకుడు( young man ) మరింత కోప్పడ్డాడు.
అతను ఆమె వీపు, చెంపపై కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఇతర వ్యక్తులు అతన్ని అడ్డుకున్నారు.వారు ఎందుకు వాదించుకున్నారో, ఏ విషయంలో గొడవపడ్డారన్న సంగతి ఇంకా తెలియ రాలేదు.
ఆన్‌లైన్‌లో వీడియోకు భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.మహిళా పోలీసు( Policewoman ) అతన్ని చెంపదెబ్బ కొట్టడం తప్పు అని కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు “పోలీసు, అది కూడా లేడీ పోలీస్ పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా తప్పు” అని అంటున్నారు.ఇకపోతే మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠగా సాగింది.భారత్ భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.అహ్మదాబాద్‌లోని 1,32,000 మందికి సరిపోయే భారీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది.ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం, ఇది 1992లో ప్రారంభమైన రికార్డు.