దీపం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది అని అంటూ ఉంటారు.ఇక ఈ మాటకు ఉదాహరణగా ఎంతో మంది హీరోయిన్లు కూడా ఉన్నారు.

 Tollywood Heroines Double Standard, Kajal, Tollywood, Lakshmi Kalyanam Movie, Trisha, Tamanna, Ileana, Shriya Saran, Rashmika Mandana-TeluguStop.com

ఒకప్పుడు హీరోల సరసన గ్లామర్ బ్యూటీ గా మెలిసి ఎన్నో సినిమాల్లో నటించిన వారే ఇక ఆ తర్వాత కాలంలో అదే హీరోల సరసన క్యారెక్టర్ ఆర్టిస్టులు గా చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా వ్యవహరిస్తూ ఉంటారు హీరోయిన్లు.

మంచి ఫాంలో ఉన్నప్పుడే బాగా డబ్బు సంపాదించి కాస్త కూడా పెట్టుకోవాలి అని భావిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారు ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేశారు.

 Tollywood Heroines Double Standard, Kajal, Tollywood, Lakshmi Kalyanam Movie, Trisha, Tamanna, Ileana, Shriya Saran, Rashmika Mandana-దీపం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన కాజల్ 2004లో ఒక హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది.ఆ తర్వాత 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమా తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది.

ఆ తర్వాత కాజల్ కెరీర్ గురించి మనకు తెలియనిది కాదు.టాలీవుడ్ చందమామ గా మారిపోయింది.

కాజల్ స్పెషల్ 26 సహా మరికొన్ని సినిమాల్లో బాలీవుడ్ లో నటించింది.

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన త్రిష జోడి చిత్రంలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంది.తన అదృష్టాన్ని పరీక్షించునెందుకు కట్ట మీరా హిందీ మూవీ లో నటించిన త్రిష మళ్లీ నార్త్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.ఇక మిల్కీ బ్యూటీ తమన్నాకు 2005లో హిందీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.2013లో హిమ్మత్వాలా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.మరిన్ని సినిమాల్లో చేసిన అక్కడ క్రేజ్ సంపాదించలేకపోయింద.

దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తన హవా ఎంత నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బర్ఫీ అనే సినిమాతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.కాని కలిసి రాకపోవడంతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇక్కడ కలిసిరాక చివరికి కనుమరుగయ్యింది.ఇష్టం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన శ్రియా సరన్ రెండు దశాబ్దాల పాటు సార్ హీరోయిన్గా వెలుగొందింది.

ఇక తుజే మేరీ కసం సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.అక్కడ అవకాశాలు అందుకోలేకపోయింది.

తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా కొనసాగుతుంది.బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు గట్టిగానే ట్రై చేస్తుంది.

జోధా అక్బర్, హౌస్ ఫుల్ మూవీ లతో పర్వాలేదనిపించింది.

చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది.వీరితో పాటు రాసి కన్నా, సమంత, నయనతార లాంటి హీరోయిన్లు కూడా బాలీవుడ్లో పాగా వేసేందుకు సిద్ధమయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube