సరికొత్త ఫీచర్స్ తో గూగుల్ మ్యాప్..!

కరోనాతో ప్రపంచం విలవిల్లాడుతున్న సమయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.గూగుల్ మ్యాప్ ద్వారా పేషెంట్ కు కావాల్సిన ఆస్పత్రి బెడ్లు ఆక్సిజన్ వివరాలను తెలుసుకునే ఏర్పాట్లు చేయనుంది.

 Google Map With Latest Features-TeluguStop.com

ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చి కరోనాతో అల్లాడుతున్న ఎంతో మందికి సాయంగా నిలువనుంది. గూగుల్ తీసుకొచ్చిన ఆ ఫీచర్ ఏంటంటే ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్ వల్ల లైవ్ సమాచారాన్ని అందివ్వడం.

దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది.త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ ని లైవ్ లోకి తీసుకురానున్నారు.“నియర్ బై మీ” సర్వీస్ తరహాలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.గూగుల్ మ్యాప్ లో కి వెళ్లి సమీపంలోని ఆసుపత్రిలో వివరాలను తెలుసుకోవచ్చు.

 Google Map With Latest Features-సరికొత్త ఫీచర్స్ తో గూగుల్ మ్యాప్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఆప్షన్ పాతది.కానీ ఇప్పుడు ఆ వివరాలకు అదనంగా, ఆ ఆస్పత్రిలోని బెడ్స్ స్టేటస్ ను కూడా చూపించబోతోంది.

అయితే ఈ సమాచారం ప్రజల నుండి సేకరించిందే, కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తోంది గూగుల్.గూగుల్ క్యూఆర్ కోడ్ ఫీచర్ ద్వారా ఈ విషయాలు పొందవచ్చు.

కొవిడ్ 19 వ్యాక్సిన్ సమాచారాన్ని కూడా గూగుల్ మ్యాప్ లో పొందవచ్చు.అంటే వ్యాక్సిన్ ప్రభావం, వ్యాక్సిన్ వివరాలు , ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనే వివరాలు కూడా ఈ గూగుల్ మ్యాప్ లో పొందవచ్చు.

అయితే వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం నుంచి సేకరించి అందిస్తున్నామని గూగుల్ చెబుతోంది.వీటన్నిటిని కూడా గూగుల్ లో ఫీచర్ కోడ్ ద్వారా యూజర్స్ తెలుసుకోవచ్చని గూగుల్ చెబుతోంది.

హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ వ్యాక్సిన్ సమాచారంతో పాటు సెల్ఫ్ కేర్, ట్రీట్మెంట్ ముందస్తు జాగ్రత్తలు తదితర వివరాలు కూడా గూగుల్ మ్యాప్స్ లో పొందవచ్చు.వీటిని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి వినియోగదారులకు అందించనుంది.

దీనితో వీటి వివరాలు యూట్యూబ్ లో కూడా ఓ సెక్షన్ రూపంలో గూగుల్ అందిస్తోంది.ఇందులో కరోనా నియంత్రణ చిట్కాలు కూడా ఉన్నాయి.

#New Features #Google Maps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు