వామ్మో: చైనా దేశానికి సంబంధించి 2500 యూట్యూబ్ చానెల్స్ ను తొలగించిన గూగుల్...!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మహమ్మారి కారణం అయిన చైనా దేశాన్ని అనేక దేశాలు వ్యతిరేకిస్తూ మాటల యుద్ధానికి దిగాయి.

 Google, China, Apps, You Tube, Channels, Ban, Google Deleted 2500 China Youtube-TeluguStop.com

మరికొన్ని దేశాలైతే వారికి జరిగిన నష్టాన్ని చైనా దేశం తీర్చాలని కూడా తెలిపాయి.గత నెలలో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు 20 మంది చనిపోయిన నేపథ్యంలో…, అలాగే భారత ప్రజల సమాచారన్నీ దొంగిలిస్తుందని సమాచార నేపథ్యంలో చైనా దేశానికి సంబంధించిన మొదటిసారి మొత్తం 59 యాప్స్ ను తొలిగించిన, ఆ తర్వాత మరోసారి 47 యాప్ లను నిషేధించింది ప్రభుత్వం.

ఇక ఇప్పుడు గూగుల్ సంస్థ చైనా దేశానికి పెద్ద షాక్ ఇచ్చింది.చైనా దేశ ప్రజలకు చెందిన 2,500 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ను గూగుల్ సంస్థ వాటిని తొలిగించింది.

సదరు చానెల్స్ లో గందరగోళ సమాచారం ఉండటం కారణంగా అవి కాస్త ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలుపుతూ గూగుల్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.అయితే ఈ ఛానల్స్ ను ఇదివరకే ఏప్రిల్ నుండి జూన్ నెలల మధ్య కాలంలో తొలగించినట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.

Telugu Apps, Channels, China, Google, Googlechina, Tube-

అయితే ఇందుకు గల ప్రధాన కారణం చైనా దేశానికి సంబంధించి ఇన్‌ఫ్లూయెన్స్ ఆపరేషన్ల కోసం కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గూగుల్ వివరణ ఇచ్చింది.ఈ సమాచారాన్ని తాజాగా త్రైమాసిక బులిటెన్ లో పొందుపరిచింది.అయితే ఇందుకు సంబంధించి గూగుల్ ఏ ఛానళ్లను తొలిగించిందో వారి పేర్లను మాత్రం అసలు తెలపలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube