యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలగడమేకాకుండా పలు మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని ఇప్పటికే వైద్య శాస్త్రంలో నిరూపితమయింది.దీంతో అధికంగా ఒత్తిడిలో ఉన్న వాళ్ళు మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకి యోగా మంచి ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.
అయితే ఈ యోగా చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని మరి కొందరు వైద్యులు చెబుతున్నారు.
కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు యోగా ఎలా చేయాలనే విషయాలను గురించి తెలియజేస్తూ వీడియోలు, ఫొటోలు వంటివి షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో “న్యూడ్ యోగ గర్ల్” ఖాతాలో ఓ యువతి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా యోగాసనాలు వేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ యోగాపై అవగాహన కల్పిస్తోంది.అయితే ఇందులో కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోలపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఆ యువతి చేస్తున్న యోగాసనాలను మాత్రమే చూడండి అందులో ఎలాంటి అశ్లీలత లేదని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ న్యూడ్ యోగ గర్ల్ ఖాతా కి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ బాగానే పెరుగుతోంది.కాగా ప్రస్తుతం ఈ ఖాతాని దాదాపుగా 14 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
ఇందులో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు మరియు స్టార్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు.