UPSC: ఆ ప్రేమికులిద్దరూ IASకి ప్రిపేర్ అయ్యారు... IAS సాధించగానే ఆమె అతడిని వదిలేసింది!

ఇది ఒక భగ్న ప్రేమికుడి కధ.యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఢిల్లీకి వెళుతూ వుంటారు.

 Girl Friend Leaves Boy Friend After Topping Upsc Exams Viral Love Story Of A Bi-TeluguStop.com

ఈ పరీక్షలు ఎంత కస్టమైనవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు… అందువలనే యే కొద్దిమందో దీనిలో వుత్తీర్ణత సాధించగలరు.తాజాగా సోషల్ మీడియాలో అటువంటి పోరాట కథ ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో అతగాడి ప్రేమకధ కొన్ని హృదయాలను కలచివేస్తోంది.ఈ కధలో IAS కావాలని ఆశపడ్డ ఓ వ్యక్తి తన పోరాటం, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న తన అనుభవాన్ని మనం చూడవచ్చును.

వైరల్‌ అవుతున్న వీడియోలో… హరేంద్ర పాండే అనే యువకుడు తాను గత 11 సంవత్సరాలలో 5 సార్లు UPSC పరీక్షలకు హాజరయ్యానని చెప్పడం గమనార్హం.అయితే తాను ఎంపిక కాలేదని పేర్కొన్నాడు.

అయితే, UPSCలో విజయం సాధించిన తర్వాత మనుషులు మారిపోతున్నారంటూ ఈ సందర్భంగా హరేంద్ర పాండే వాపోయాడు.తన అనుభవాన్ని పంచుకుంటూ.

తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ వుండేదని, ఆమె ఐ‌ఏ‌ఎస్ సాధించినట్టుగా తెలిపాడు.కానీ, ఆమె ఐఏఎస్‌ అధికారిణిగా పదవి సాధించిన వెంటనే తన నంబర్‌ను మార్చుకుందని చెప్పాడు.

అప్పటి నుండి వారు మళ్లీ కలుసుకోలేదని, తనను పూర్తిగా పక్కన పెట్టేసిందంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు హరేంద్రపాండే.

Telugu Bihar, Harider Panday, Prepare, Upsc, Upsc Exams, Latest, Love Story-Late

అతని వీడియోను ఓ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా అది కాస్త వైరల్ అయింది.హరేంద్ర పాండే బీహార్‌లోని గోపాల్‌గంజ్ నివాసి.11 సంవత్సరాలలో అతను 5 సార్లు UPSC పరీక్ష రాశారు.అతను 4 సార్లు గట్టిగానే ఎటెమ్ట్ చేశాడు.అయితే అదృష్టం అతనికి మద్దతు ఇవ్వలేదు.అతను చదువులో బెస్ట్‌ స్టూడెంట్‌.కానీ విధి తనని వెక్కిరించింది.

ప్రిపరేషన్ సమయంలో తాను చేసిన తప్పులను కూడా అంగీకరించాడు.ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేయడంతో యూట్యూబ్‌ వినియోగదారులు హరేంద్ర దృఢ సంకల్పం, నిజాయితీని ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube