రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు గెటప్ శ్రీను.
మరీ ముఖ్యంగా తన గెటప్ తో ప్రేక్షకులను సగం కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.అలాగే హీరోల వాయిస్ ని కమెడియన్ల వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ మరింత నవ్విస్తూ ఉంటాడు గెటప్ శ్రీను.
బుల్లితెర తో పాటు అటు వెండితెర పై కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన విషయం తెలిసిందే.ఇప్పటికే వెండితెరపై పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా గెటప్ శ్రీను కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఇటీవలే హనుమాన్ టీజర్ రిలీజ్ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఒక రేంజ్ లో పొగిడాడు.
అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా పొగుడుతూ రాజమౌళితో పోల్చుకుంటే ప్రశాంత్ గొప్ప డైరెక్టర్ కాదు అంటూ కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.ఇదే విషయంపై గెటప్ శ్రీను పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా శ్రీను స్నేహితులు అయిన సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్ ని కూడా ఈ విషయంలోకి లాగుతున్నారు.

ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా మరి ఈ విషయంలో వారిద్దరు ఎందుకు స్పందించలేదు.ఫ్రెండ్ పై సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే మీ వంతు సహాయంగా శ్రీను ఏదో పొరపాటుగా అన్నాడు అంటూ వారు అన్న క్లారిటీ ఇవ్వాలి కదా! సైలెంట్ గా పని చేసుకుంటూ ఉంటే ఎలా? అంటూ గెటప్ శ్రీను అభిమానులు మండిపడుతున్నారు.ఇదేనా మీ ఫ్రెండ్ షిప్? శ్రీను లేకపోతే మీ స్కిట్స్ ఎలా ఉంటాయో మీ అందరికి బాగా తెలుసు అంటూ సుధీర్, రామ్ ప్రసాద్ పై ట్రోల్స్ చేస్తూ మండి పడుతున్నారు.ఇదే వార్తపై పలువురు స్పందిస్తూ ఈ విషయం లో శ్రీను కీ సుధీర్ సహాయం చేయలేను అంటూ చేతులెత్తేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.