ప్రశాంతంగం ఉన్న ప్రజల్లోకి కరోనా వచ్చి విలయతాండవం చేసింది.ఒక్కసారిగా వచ్చిన కరోనా అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
స్కూల్లు, ఆఫీసులు ప్రతి ఒక్కటి మూసి వేశారు.చైనాలో పుట్టిన కరోనా ప్రతి ఒక్క దేశానికి క్రమంగా విస్తరించింది.
అయితే చైనాలోనే కరోనా పుట్టింది అని పలువురు నిపుణులు పేర్కొన్నారు.వారి ఆహార అలవాట్లే ఈ మహమ్మారికి కారణం అని కూడా వార్తలు పుట్టలుగా వచ్చాయి.
గతంలో ఉన్న కరోనా ప్రభావం ఇప్పుడు అంతగా లేనట్టుగానే కనిపిస్తుంది.అయితే చైనాలో పుట్టిన కరోనా మల్లీ అక్కడ విలయతాండవం చేస్తుంది అని ఆ దేశ జనాభా ఆందోళన చేందుతున్నారు.
దీంతో పలు ఇతర దేశాలకు కూడా మల్లీ కరోనా టెన్షన్ మొదలైంది.ప్రయాణాల ద్వారా మల్లీ విజృంభిస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు.
చైనాలో కరోనా వ్యాప్తి విలయతాండవం చేస్తోంది.కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు వైరస్ బారినపడుతున్నారు.ఈ క్రమంలో మళ్లీ లాక్‌డౌన్‌లను విధిస్తోంది చైనా ప్రభుత్వం.
ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్ ప్రభావం లేదు.కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది.
మళ్లీ 2020కి ముందున్న సాధారణ పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి.కానీ కరోనావైరస్ పుట్టినట్లుగా చెబుతున్న చైనాలో మాత్రం ఇంకా కరోనా కల్లోలం కొనసాగుతోంది.
చైనాలో జీరో-కోవిడ్ విధానం కోసం అక్కడి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.కరోనా ఉన్న ప్రతి పట్టణంలోనూ కఠినమైన లాక్‌డౌన్ విధిస్తున్నారు.
ఐనప్పటికీ కోవిడ్ అదుపులోకి రావడం లేదు.పైగా కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

చైనాలో బుధవారం 31వేల 454 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఈ ప్రపంచంలో కరోనా-19 వెలుగు చూసినప్పటి నుంచీ ఈ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి.పెరుగుతున్న కేసులను చూసి చైనా ప్రభుత్వం కలరవపడుతోంది.ప్రస్తుతం బీజింగ్, షాంఘై, గువాన్జౌ, చాంగ్‌కింగ్ నగరాల్లో కేసులు సంఖ్య ఎక్కువగా ఉంది.అక్కడ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు.ఆంక్షలు చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.చైనాలోని యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్లాంట్‌లో ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నామని మండిపడుతున్నారు.

చైనాలోని చాలా ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.ఏ మాత్రం కేసులు పెరిగినా వెంటనే.లాక్‌డౌప్ విధిస్తున్నారు.ఆఫీసులు, రెస్టారెంట్లను మూసివేస్తున్నారు.ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం మహా నగరాల్లోనూ కరోనా వ్యాప్తి పెరగడంతో.
ఆయా చోట్ల కూడా మళ్లీ కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.కరోనా వల్ల ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.
ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్స్ విధిస్తే.మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో చైనాలో ఒక్క కొవిడ్ కేసూ ఉండకూడదని షీ జిన్‌పింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం ఆచరణలో విఫలమైంది.ఇక చైనా దేశమంతటా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 31,444 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇది ఏప్రిల్ 13న నమోదైన పూర్వ రికార్డు 29,317 కేసులకన్నా చాలా ఎక్కువ.గడచిన రెండు వారాలుగా కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.శీతాకాలం చలిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం లాక్‌డౌన్ పేరిట అపార్ట్‌మెంట్లను, షాపింగ్ మాల్స్, కార్యాలయ భవనాలను, ఫ్యాక్టరీలనూ మూసివేస్తోంది.అయితే పెరుగుతున్న కరోనాను చూసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.







