గాడ్సే కు గాంధీభవన్ అప్పచెప్పారు: కేటీఆర్

తమ పార్టీ కుటుంబ రాజకీయాలు ఆలంబనగా మారిందని అవినీతి మయంగా మారిపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.( KTR ) వారసత్వ రాజకీయాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఎరుకున్నట్టుగా ఉందంటూ విమర్శించారాయన.

 Gandhi Bhavan Handed Over To Godse Ktr , Ktr , Gandhi Bhavan, Rahul Gandhi, Jawa-TeluguStop.com

జవహర్ లాల్ నెహ్రూ ( Jawahar Lal Nehru )తరం నుంచి వారసత్వ రాజకీయాలను దేశానికి అందిస్తున్న గాంధీ కుటుంబం ఇతర పార్టీలను వారసత్వ పార్టీలని విమర్శించడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు .అంతేకాకుండా 50 కోట్లకు సీట్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ( Congress party ) తమ మీద అవినీతి ఆరోపణలు చేస్తుందని , ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకి పిలిచి అడిగినా రేవంత్ అవనీతి గురించి రాహుల్ కు చెప్తారని , కేవలం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప రాహుల్ కి కనీసం జ్ఞానం లేదంటూ ఆయన విమర్శించారు.అవినీతికి నిలువుటద్దం లా మారిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని అవినీతిపై రాహుల్ మాట్లాడడం చాలా విచిత్రంగా ఉందని ,80 వేల కోట్లతో పూర్తయిన కాలేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటూ నిలదీశారు.

Telugu Congress, Gandhi Bhavan, Rahul Gandhi, Revanth Reddy-Telugu Political New

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బజాపా కోవర్టుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని గాడ్సేకి గాంధీభవన్ తాళాలు ఇచ్చిన కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుందంటూ వ్యాఖ్యానించారు.మాట్లాడితే రాహుల్ తమది భాజాపాకు బీ పార్టీ అని విమర్శిస్తారని మేము బి పార్టీ కాదని మీరే దేశానికి సి పార్టీ అని అంటే చోర్ పార్టీ అని, ఆకాశం నుంచి పాతాళం దాకా కాంగ్రెస్ చేయని అవినీతి లేదని , మళ్ళీ దేశానికి ఏదో ఉద్ధరించిన వాళ్ళలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూరంటూ ఆయన విమర్శించారు.తాగునీరు, సాగునీరు, విద్యుత్, పెన్షన్, ఇలా ఏ విషయంలోనూ కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదని, పుట్టక నుంచి చావు దాకా ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని, శతాబ్దానికి ఒకసారి వచ్చే కెసిఆర్ లాంటి నాయకుడి ని తెలంగాణ ప్రజలు పోగొట్టుకోకూడదు అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube