సాధారణంగా చాలామంది మహిళలు సరైన ఎడ్యుకేషన్ లేక జాబుల్లో రాక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్( Financial independence ) సాధించలేకపోతుంటారు.అయితే ఇలాంటి వారికి ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కొంతమంది ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం లక్ష్మి గోపే ( Lakshmi Gope )అనే ఒక 64 ఏళ్ల వృద్ధురాలు బట్టలు కుట్టడం, డెకరేషన్స్‌లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తోంది.ఈ మహిళ ఒకప్పుడు తన కుటుంబాన్ని బట్టలు కుట్టడం, డెకరేషన్స్ ద్వారా పోషించేది.
ఇప్పుడు, ఆమె పిల్లలు స్థిరపడ్డారు, ఆమె తన సమయాన్ని యువతులకు నైపుణ్యాలు నేర్పించడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించాలనుకుంటుంది.
ఆమె ట్రైనింగ్ ఇవ్వడం కాదు ఫ్రీగా భోజనం కూడా పెడుతుంది. ఫ్రీగా అకామిడేషన్( Free accommodation ) కూడా అందిస్తుంది.ఈ ట్రైనింగ్ ఆరు నెలల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో కుట్టుపని, డెకరేషన్స్‌లోని వివిధ అంశాలలో నైపుణ్యం సాధిస్తారు.“నేను బ్లౌజ్‌లు, లెహంగాల నుంచి సల్వార్ సూట్లు కుట్టే వరకు అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తాను,” అని లక్ష్మీ వివరించింది.రోజూ మూడు గంటల పాటు జరిగే క్లాసులు తీసుకుంటుంది.
పార్టిసిపెంట్స్ ప్రాక్టికల్స్ స్కిల్స్ అందిస్తాయి.వీటితో వాస్తవ ప్రపంచంలో వేలల్లో డబ్బులు సంపాదించవచ్చు.
లక్ష్మీ మాట్లాడుతూ.“కష్టమైన పరిస్థితుల్లో ఉన్న చాలా మంది మహిళలు నా దగ్గరకు వస్తారు.వేరే చోట శిక్షణ పొందలేక, నా దగ్గర మద్దతు పొందుతారు,” అని చెప్పింది.తన చొరవ ఇప్పటికే 500 మందికి పైగా అమ్మాయిల జీవితాలను మార్చింది, ప్రస్తుతం 10 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు.“నా పిల్లలు ఇప్పుడు నాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారు, అందువల్ల ముందుకు సాగగలుగుతున్నాం.” అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో చేరడానికి లేదా ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు లక్ష్మీ గోపెను +91-62010-82385లో సంప్రదించవచ్చు.