హిప్పో నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్ విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్..

జూలకు వెళ్లే సందర్శకులు వన్యప్రాణుల ప్రాణాలను రిస్కులో పడేస్తున్నారు.చెత్త వేయడం, జంతువులకు తినలేని వస్తువులు తినిపించే సంఘటనలు పెరుగుతున్నాయి.

 The Video Of A Person Who Threw A Plastic Bag In The Mouth Of A Hippo Went Viral-TeluguStop.com

ఇటీవల ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.ఒక ఘటనలో, ఒక వ్యక్తి హిప్పొపొటమస్( Hippopotamus ) నోట్లోకి ప్లాస్టిక్ బ్యాగ్ విసిరేసాడు.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.ఇప్పుడిది జంతువుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది, అలానే చర్చనీయాంశంగా మారింది.

ఈ భయంకరమైన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియా యూజర్లు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఇండోనేషియా, వెస్ట్ జావాలోని టామన్ సఫారీ( Taman Safari in West Java, Indonesia ) అనే జూలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వైరల్ వీడియోలో, కొంతమంది సందర్శకులు కారులో జంతు ప్రదర్శన ప్రాంతంలో ప్రయాణిస్తుండటం చూడవచ్చు.వీళ్లు నీటిలో ఉన్న హిప్పొపొటమస్‌కు క్యారట్ తినిపించాలని ప్రయత్నించారు.కానీ, అదే సమయంలో మరొక సందర్శకుడు, హిప్పొ నోటిలో ప్లాస్టిక్ సంచిలాంటి వస్తువుని విసిరివేశాడు.అది ప్రమాదకరమని తెలియని ఆ జంతువు దానిని నమలడం మొదలుపెట్టింది.

ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని అధికారులను డిమాండ్ చేస్తుంటే, మరికొందరు ఈ ఘోర ఘటనను చూసి కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఇప్పటి వరకు ఈ వీడియోకు 20 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“ఆ వ్యక్తిని నేరుగా జైలుకు పంపించండి,” అని ఒకరు కామెంట్ చేశారు.“ఇది అసహ్యకరమైన చర్య,” ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపాడు.

టామన్ సఫారీ జంతుప్రదర్శనశాల ప్రతినిధి అలెగ్జాండర్ జుల్కర్నైన్ ( Alexander Zulqarnain )మాట్లాడుతూ, ఆ పర్యాటకుడిని గుర్తించామని, అతను బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరామని తెలిపారు.“ఆ వ్యక్తిని తీసుకువెళ్లే వాహనం నంబర్ ప్లేట్‌ను మేం గుర్తించాం.ఇండోనేషియా సఫారీ పార్క్‌లో నిబంధనలు పాటించడం గురించి ఇతర సందర్శకులకు పాఠం నేర్పడానికి అతని చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని చూస్తున్నాం,” అని అతను అన్నారు.అంతేకాకుండా, హిప్పొను పరీక్షించారని, ఆ జంతువు ఆరోగ్యంగా ఉందని అలెగ్జాండర్ జుల్కర్నైన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube