ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ? 

వైసిపి నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ( Former Visakha MP MVV Satyanarayana )వ్యవహారం వైసీపీ లో చర్చనీయాంశంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఎం వివి సత్యనారాయణ ఆసక్తి చూపించకపోవడం,  స్వయంగా జగన్ పోటీ చేయమని కోరినా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

 Is Mvv Looking Towards Bjp And That's Why He Withdrew From The Contest, Mvv Saty-TeluguStop.com

  నిన్న తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్ తో ఎంవివి భేటీ అయ్యారు .ఈ సందర్భంగా విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎం వి విని పోటీ చేయాల్సిందిగా జగన్( jagan ) సూచించారు.

Telugu Ap Bjp, Mvvbjp, Mlavamsi, Purandareswari, Visakha Mp Bjp, Ysjagan-Politic

అయితే వ్యాపార పరంగా ప్రభుత్వం నుంచి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కేసుల విచారణ నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని ఎంవివి స్వయంగా జగన్ కి చెప్పారట గతంలో వైసీపీ ( ycp )నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ ( Vamsikrishna Srinivas )జనసేన నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ,  ఆర్థికంగా బలంగా ఉన్న ఎం వి వి అయితే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు.

Telugu Ap Bjp, Mvvbjp, Mlavamsi, Purandareswari, Visakha Mp Bjp, Ysjagan-Politic

అయితే తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని , పలు కేసులు నమోదు చేసిందని,  ఈ సమయంలో తాను పోటీ చేయలేనని జగన్ కే నేరుగా చెప్పేసారట.వివాదాస్పద హయగ్రీవ ప్రాజెక్ట్ ( Hayagriva Project )ను కూడా జిపిఎంసి పనులు నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న సిబిసిఎంసి స్థలంలో పనులను నిలిపివేయాల్సిందిగా జీవీఎంసీ ఆదేశాల జారీ చేసింది.అలాగే హయగ్రీవ విషయంలో జగదీశ్వరుడు ఎంవీవీ పై ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అందుకే ఎంవీవీ కూడా ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కేసుల భయం ఉండడంతో వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరాలని ఎంవీబీ సత్యనారాయణ భావించినా,  ఆయనను చేర్చుకునేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించుకోవడంతో బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube