గత వైసిపి( ycp ) ప్రభుత్వంలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Punganur MLA Peddireddy Ramachandra Reddy ) హవా కు పులిస్టాప్ పడింది.గత ఎన్నికల్లో టిడిపి , జనసేన , బిజెపి కూటమి అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి హవా కు బ్రేక్ పడిపోయింది.
వైసీపీ అధికారంలో ఉండగా ఏపీ వ్యాప్తంగానే కాకుండా తన సొంత జిల్లా చిత్తూరులోని అన్ని నియోజకవర్గాలపైన పెద్దిరెడ్డి హవా నడిచేది.ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దీటుగా తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ పెద్దిరెడ్డి రాజకీయం నడిపించేవారు.
చిత్తూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలైన పూతలపట్టు, సత్యవేడు , గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేల పై పూర్తిగా పెత్తనం చేసేవారు.
అలాగే అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామికి ( Narayana Swamy )అలాగే , మంత్రి రోజాకు( Minister Roja ), శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి పెత్తనం సాగించడం వంటి వాటిపైన అప్పట్లో జగన్ కూా ఫిర్యాదులు వెళ్లాయి.అయినా జగన్ మాత్రం పెద్దిరెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం, పార్టీలను ప్రభుత్వంలోనూ ఆయనని కేల్కం చేయడం వంటి కారణాలతో పెద్దిరెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు కూడా వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు వెనకడాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది.అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలిస్టాప్ పడింది .సొంత కేడర్ సైతం తిరుగుబాటు ఎగరవేస్తున్నారు.సొంత నియోజకవర్గమైన పుంగనూరులో వైసీపీకి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు.
తాజాగా పులిచెర్ల మండల జెడ్పీటీసీ మురళీధర్ ( ZPTC Muralidhar )వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఇద్దరు వైస్ ఎంపీపీలు, అనేకమంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పెద్దిరెడ్డి తమను పట్టించుకోవడంలేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు.ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా తనను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందడం పైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళనలో ఉన్నారట.