మన ఇండియన్ స్పైసెస్ లో లవంగం ఒకటి.అయితే లవంగమే కదా అని తీసి పారేయొద్దు.
చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది.నాన్ వెజ్ వంటల్లో, బిర్యానీ, పులావ్ వంటి ఐటమ్స్ తయారీలో లవంగాలను తప్పనిసరిగా వాడతారు.
ఆహారానికి ప్రత్యేకమైన రుచిని జోడించడమే కాకుండా లవంగాలు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.వివిధ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
– చాలామంది పొడి దగ్గు( dry cough ) సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఎన్ని మందులు వాడినా ఆ దగ్గు పోనే పోదు.అయితే వేయించిన లవంగాలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే పొడి దగ్గు కంట్రోల్ అవ్వడమే కాకుండా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
– నోటి దుర్వాసనతో( bad breath ) సతమతం అయ్యేవారికి కూడా లవంగాలు చాలా బాగా సహాయపడతాయి.నాలుగైదు లవంగాలను ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల నోరు మరియు కడుపులో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది.బ్యాడ్ బ్రీత్ సమస్య దూరం అవుతుంది.
– కఫం తగ్గాలంటే పావు టీ స్పూన్ లవంగాల పొడిలో పావు టీ స్పూన్ మిరియాలు పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తీసుకోవాలి.ఇలా చేస్తే కఫం మొత్తం కరిగిపోతుంది.
– పంటి నొప్పితో ( toothache )సతమతం అవుతున్న వారికి లవంగ తైలం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.లవంగ తైలంలో ముంచిన దూదిని నొప్పి ఉన్న పంటిపై పెడితే చక్కటి ఉపశమనం పొందుతారు.
– వికారం విపరీతంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు లవంగాల పొడి మరియు ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి.ఇలా కనుక చేస్తే వికారం నుంచి వేగంగా రిలీఫ్ పొందుతారు.
– తలనొప్పిని తగ్గించే సత్తా కూడా లవంగానికి ఉంది.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు లవంగాల పొడి, ఒక స్పూన్ అల్లం రసం మరియు తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే తలనొప్పి నుంచి వేగంగా బయటపడతారు.
– ఇక మనలో చాలామంది అజీర్తి సమస్యతో బాధపడుతూ ఉంటారు.అజీర్తి కారణంగా ఏం తినాలన్నా జంకుతుంటారు.
అలాంటివారు భోజనానికి ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి తినాలి.ఈ విధంగా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ జోరుగా మారుతుంది.
అజీర్తి సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.