విశాఖ: ముఖ్యమంత్రి సమక్షంలో శాసనసభను కౌరవ సభ గా మార్చారు.సభలో నీచాతి నీచంగా వ్యవహరించారు.
అసెంబ్లీ చరిత్రలో ఇది మాయని మచ్చ.విలేకరులకు పంపిన వీడియో లో శాసనసభ తీరును విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న.
రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను సభలో ప్రస్తావించి వారిపై లేనిపోని అభాండాలు వేయడం విచారకరం.సభలో హుందాగా ఉండాల్సిన సభ్యులు దిగజారుడు వ్యవహారాలు చేస్తుంటే సీఎం శునకానందం తో శాడిస్ట్ లా వ్యవహరించారు.
అదే మీ భార్య, తల్లి, చెల్లిని అంటే మీరు బాధపడరా? వంశీ, కొడాలి నాని లకు చంద్రబాబును విమర్శించే స్థాయి ఉందా??
ఇలాంటి చర్యలను మహిళా లోకమంతా తిప్పికొట్టాలి.చంద్రబాబుకు పదవులు కొత్త కాదు ఆయన లేకపోతే రాష్ట్రం నష్ట పోతుంది.
డిజిపి పోలీసు వ్యవస్థను జగన్ కు తాకట్టు పెట్టారు.ఆయన చర్యతో మూడు సింహాలు సిగ్గుతో తలదించుకుంటున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు??? సమస్యలను పక్కదారి పట్టించేందుకే కల్పిత కబుర్లు తెరపైకి తెచ్చారు.బాబాయ్ హత్యపై హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ దాన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.