రీసెంట్‌గా చనిపోయిన సైరస్ మిస్త్రీ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా పనిచేసిన సైరస్ మిస్త్రీ ఇటీవల మహారాష్ట్రలో ఒక కారు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.ఇతడి వయసు కూడా చాలా తక్కువే.

 Former Tata Sons Chairman Cyrus Mistry Wealth Is This Much Details, Former Tata-TeluguStop.com

అకాల మరణం చెందిన తర్వాత చాలా మంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అతని మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

అసలు ఎవరీ సైరస్ మిస్త్రీ? అతను ఏం చేశారు? అతనికి ఎంత ఆస్తులు ఉన్నాయి? అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.దేశీయ వ్యాపార దిగ్గజం షాపూర్‌జీ పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ.

జులై 4, 1968లో పుట్టిన అతను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో విద్యనభ్యసించారు.

లండన్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.

ఆ తర్వాత 1991లో తన షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కో కంపెనీకి సంచాలకుడిగా నియమితులయ్యారు.మళ్లీ 15 ఏళ్ల తర్వాత 2006లో టాటా సన్స్‌ బోర్డులో తన తండ్రి హోదాని భర్తీ చేశారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ టాటా ఎలెక్సీలో డైరెక్టర్‌గానూ ఎంపికయ్యారు.ఆ పొజిషన్‌లో కొంతకాలం పాటు కొనసాగిన ఆయన డిసెంబర్, 2012లో ‘టాటా సన్స్’ ఛైర్మన్‌ పదవిని చేపట్టారు.

రతన్‌ టాటా తప్పుకోవడంతో దానికి ఛైర్మన్‌ అయ్యే అవకాశం అతడికి దక్కింది.

Telugu Cyrus Mistry, Cyrusmistry, Tatachairman, Net Wealth, Ratan Tata, Tata-Lat

కొంతకాలం తర్వాత టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌ గా చేసే సువర్ణావకాశం లభించింది.ఆ కాలంలో ఈ వ్యాపారవేత్త ఇంగ్లాండ్, భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్‌ ఇండస్ట్రియలిస్ట్‌గా పేరుగాంచారు.యంగ్ అండ్‌ డైనమిక్‌ బిజినెస్‌ మెన్‌గా అతన్ని అప్పట్లో తెగ కొనియాడారు.

అయితే కొన్ని మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు రావడంతో 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ ఛైర్మన్‌ పదవి నుంచి అతన్ని తొలగించారు.అయితే, 2018 ఆస్తి గణాంకాల ప్రకారం, ఆయన స్థిర, చర ఆస్తుల విలువ అక్షరాలా రూ.80 వేల కోట్లు! మరి ఇప్పటి లెక్కల ప్రకారం ఆయన ఆస్తి రూ.లక్ష కోట్లు ఉన్నా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube