మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ బీజేపీలో చేరారు.ఢిల్లీలో కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
ఈ మేరకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.బీజేపీలో చేరిన బూర సాయంత్రం జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.
అయితే, ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి బూర రాజీనామా చేశారు.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టికెట్ ఆశించిన ఆయన.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.