కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అలా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలలో కాంతార సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించడంతో పాటు కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని ఇండస్ట్రీ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే కాంతార మూవీ కథ నిజంగా జరిగిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం.సినిమాలోని అన్ని సన్నివేశాలు కాకపోయినా కొన్ని సన్నివేశాలు కర్ణాటక రాష్ట్రంలో నిజంగానే జరిగాయని బోగట్టా.
రిషబ్ శెట్టి సొంత గ్రామంలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం కోలం కట్టిన అతను చెప్పిన విధంగా కొంతమంది మనుషులు మరణించారని బోగట్టా.ఆ సన్నివేశాలను ప్రేరణగా తీసుకుని కొన్ని మార్పులు చేసి రిషబ్ శెట్టి కాంతారను తెరకెక్కించారు.
సినిమాలో చూపించిన విధంగా దేవుళ్లు మనిషిలోకి రావడం మనుషులు దేవుళ్లతో మాట్లాడటం లాంటి ఘటనలను రిషబ్ శెట్టి నిజంగానే చూశారని సమాచారం.

కాంతార మూవీ కథ రియల్ స్టోరీ కాగా ఈ తరహా కథల గురించి మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారనే సంగతి తెలిసిందే.కాంతార సక్సెస్ తో ఈ తరహా కథలను తెరకెక్కించే దిశగా దర్శకనిర్మాతలు అడుగులు వేస్తున్నారు.

కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమా కథలలో కీలక మార్పులు చేస్తూ తమ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించడానికి దైవత్వానికి సంబంధించిన సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రిషబ్ శెట్టి గత సినిమాలు కూడా వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.రిషబ్ శెట్టి కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తనకు సూట్ అయ్యే ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.







