రైతుల సమస్యలపై మాజీమంత్రి కేటీఆర్ రియాక్షన్..!

తెలంగాణలో రైతుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలన్న కేటీఆర్ ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం.!! అయ్యాయని విమర్శించారు.గత పదేళ్ల కాలంలో ఏనాడు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామన్నారు.విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని పేర్కొన్నారు.

 Former Minister Ktr's Reaction On Farmers' Problems , Brs , Congress , Ktr , Kc-TeluguStop.com

అలాగే కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లను చూస్తున్నామని తెలిపారు.

ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు -జనరేటర్ల మోతలు చూస్తున్నామన్నారు.సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నామన్న కేటీఆర్ రైతుబంధు( Rythu Bandhu ) కోసం నెలలపాటు పడిగాపులు కాస్తున్నామన్నారు.

కనీసం రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదని దుయ్యబట్టారు.కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు.

అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని చెప్పారు.ఈ వైఫల్యాల కాంగ్రెస్( Congress ) పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలోనని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube