హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ( CCS ACP Uma Maheswara Rao )అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.న్యాయం కోసం వెళ్లిన బాధితులను నానా అవస్థలకు గురి చేశాడని తెలుస్తోంది.
ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి.ఈ క్రమంలోనే ఆయనపై మూడు సార్లు సస్పెన్షన్ వేటు పడింది.అయినప్పటికీ ఉమా మహేశ్వరరావు తన తీరును మార్చుకోలేదు.సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి ఉమామహేశ్వర రావు లక్షల రూపాయలు వసూళ్లు చేశారని వెల్లడైందని సమాచారం.
అంతేకాకుండా ఎన్నారైలను బెదిరించి డబ్బులు దండుకున్నారని తెలుస్తోంది.ఉమా మహేశ్వర రావు బూతు పురాణంపై సిబ్బంది సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఉమామహేశ్వర రావు నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.