కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు నలభై వేల మంది వరకు బలి తీసుకుంది.ఇక ఇండియాలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది.
ఇప్పటికి ఈ సంఖ్య అరవైకి చేరువ అయ్యింది.మరో వైపు కేసుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి.
ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ చాపక్రింద నీరులా వ్యాపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఇతర దేశాలలో ఎంతో మంది ప్రముఖులని కరోనా బలి తీసుకుంది.
సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు కరోనాతో మరణించారు.ఇప్పుడు ఇండియాలో కూడా ఓ ప్రముఖ వ్యక్తి మృతి చెందారు.
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా ఈ ఉదయం కన్నుమూశారు.ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు బుధవారమే తేలింది.
అంతలోనే ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందారు.ఈ విషయాన్ని అమృత్‌సర్ సివిల్ సర్జన్ తెలిపారు.
పంజాబ్‌లో ఇది రెండో కరోనా కేసు కాగా, జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే.అంతకుముందు హోషియార్‌పూర్‌కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు.అతనికి కరోనా పోజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
దీంతో అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఇంతలో ఊహించని విధంగా అతను మృతి చెందడం అందరిని కలచివేసింది.