వింటర్ సీజన్( Winter season ) వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోయి చాలా అసహ్యంగా మారుతుంటుంది.ముఖంలో ఎలాంటి కాంతి కనిపించదు.
దాంతో అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి ఎంతో బాధపడుతుంటారు.కానీ ఇకపై చింతించకండి.
ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్కులను ట్రై చేస్తే వింటర్ లో హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ ఆ ఫ్రూట్ మాస్కులు ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కివీ పండును( Kiwi fruit ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోండి.ఇప్పుడు ఒక బౌల్ లో కివి పండు ప్యూరీ, ఒక ఎగ్ వైట్( Egg white ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ ఫ్రూట్ మాస్క్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.గ్లోయింగ్, అందంగా మెరిపిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మచ్చలు మాయం చేస్తుంది.
అలాగే మరొక ఫ్రూట్ మాస్క్ కోసం.మిక్సీ జార్‌లో కొన్ని గింజ తొలగించిన పుచ్చకాయ ముక్కలు( Watermelon slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.మరియు నాలుగైదు టేబుల్ స్పూన్లు పుచ్చకాయ ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.20 నిమిషాల పాటు ఆరబెట్టుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం డ్రై అవ్వకుండా ఉంటుంది.చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
స్కిన్ టైట్ అవుతుంది.షైనీగా సైతం మెరుస్తుంది.